ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవర్ హౌస్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పరిథిలోని పవర్ హౌస్‌లను కేఆర్ఎంబీకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం కుడి గట్టున ఉన్న పవర్ హౌస్‌ను, సాగర్ కుడి కాల్వ మీదున్న పవర్ హౌస్‌ను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రం తన పరిధిలోని పవర్ హౌస్‌లను అప్పగించాకే ఏపీ పవర్ హౌస్‌లను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని షరతు విధించింది. పవర్ ప్రాజెక్టుల్లోని భవనాలను, ఇతర కట్టడాలను, యంత్ర సామాగ్రిని కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read: హుజురాబాద్ ఉప ఎన్నిక: ఎగ్జిట్ పోల్స్ పై నిషేదం…