పశ్చిమ-మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా మరియు ఉత్తర ఆంధ్ర తీరంలో గల అల్పపీడనం దానితో పాటు అల్పపీడనానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశకు వంగి ఉంది.. దీని ప్రభావంతో, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో 15 నుండి 16 అక్టోబర్ 2021 వరకు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.. ఇక, తూర్పు పశ్చిమ ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉండి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం అంతటా సుమారు 14 ° N అక్షాశంము వద్ద కొనసాగుతున్నట్టు తెలిపింది.
ఇక, వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంనది వెల్లడించింది.. ఈరోజు ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. రేపు, ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తాయని.. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. ఇక, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది… రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉండగా.. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.