పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను అనుకుని అల్పపీడనం కొనసాగుతోంది.. దాని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.. ఇక, కోస్తాలో మోస్తరు వానలు కురిసే అవకాశం ఉండగా.. తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారుల వేటపై నిషేధం విధించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఈ అల్పపీడన ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం అలెర్ట్ అయ్యింది.. జిల్లాలోని 13 తీర ప్రాంతం మండలాల ప్రజలపై అల్పపీడన ప్రభావం ఉంటుందని.. రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
also read : గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి
మరోవైపు.. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 9 కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు అధికారులు.. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేవారు.. ఇప్పటికే చేపల వేటకు వెళ్లినవారు తిరిగి తీరానికి చేరుకోవాలని ఆదేశించారు.. అల్పపీడన ప్రభావంతో.. జిల్లాలో గంటకు 50 నుంచి 60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటున్న అధికారులు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.