బద్వేల్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో అధికార వైసీపీ ఆధిక్యాన్ని కనబరిచింది. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోటీ జరిగినప్పటికీ వైసీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇప్పటికే సర్వేలు తెలిపాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిమీదనే అందరి దృష్టి నిలిచింది.
Read: లైవ్ అప్డేట్స్: హుజురాబాద్, బద్వేల్ ఎన్నికల ఫలితాలు
బద్వేల్ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థి లక్ష మెజారిటీని సాధిస్తుందని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా, బీజేపీ అభ్యర్ధికి 30 వేలకు పైచిలుకు ఓట్లు వస్తాయని, కాంగ్రెస్‌కు 20 వేలకు పైచిలుకు ఓట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నది. వైసీపీ నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణి సుధ బరిలో ఉండగా, బీజేపీ నుంచి వనతల సురేష్, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ పోటీలో ఉన్నారు. వైసీపీ సాధించే మెజారిటీపైనే అందరి దృష్టి ఉన్నది. మరి వైపీసీ నేతలు చెబుతున్నట్టుగానే లక్ష మెజారిటీ వస్తుందా? చూడాలి.