త్వరలోనే విశాఖ,గుంటూరుకు రాహుల్ గాంధీ రానున్నారు అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు చింతా మోహన్ తెలిపారు. అమరావతి,విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా పర్యటన చేయనున్నారు రాహుల్ గాంధీ. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ కొరత ఉంది.. సిద్దాంతపరంగా బలంగా ఉన్నప్పటికీ ప్రజా ఆమోదయోగ్యమైన నాయకత్వం లేదు. అటువంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నాం అని చింతా మోహన్ తెలిపారు. త్వరలో పీసీసీలో మార్పులు ఉంటాయి. కానీ అధ్యక్షుడు ఎన్నికల రేస్ లో నేను లేను…
ఏపీలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. బలం పెంచుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ 2 వ తేదీన రాష్ట్రంలో చేపట్టిన శ్రమదానం కార్యక్రమం విజయవంతం కావడంతో బలాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నది. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధిస్తోందని, అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ ఎలాంటి వలసలను ప్రోత్సహించలేదు. కాగా, ఇప్పుడు ఆ పార్టీలోకి వలసలు ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.…
తిరుమలలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లను టీటీడీ సర్వం సిద్ధం చేస్తున్నది. రేపటి నుంచి ఈనెల 15 వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. ఈరోజు సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగబోతున్నది. ఇక రేపు సాయంత్రం 5:10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. రేపు రాత్రి పెద్ద శేష వాహన సేవతో వాహన సేవలు ప్రారంభం కాబోతున్నాయి. 9 రోజులపాటు వివిధ వాహనాలపై శ్రీవారు…
రేపటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం ఇంద్రకీలాద్రిని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. రేపటి నుంచి 15 వ తేదీ వరకు ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. 9 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు సిద్దం…
కేంద్ర ప్రభుత్వం కొత్త నగరాల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నది. 15 వ ఆర్థిక సంఘం దేశంలోని 8 రాష్ట్రాల్లో 8 కొత్త నరగాలకు రూ.8 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసు మేరకు కేంద్రం కూడా నగరాల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు కూడా. అయితే, ఇప్పుడు ఆ 8 నగరాల్లో అమరావతి కూడా ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉన్నది. సుమారు 217 చ.కిమీ విస్తీర్ణంలో అన్ని రకాల హంగులతో…
ఏపీలో కొత్త పొత్తులకు బీజం పడిందా? రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు ఆ దిశగానే వెళ్తున్నాయా? బద్వేలు ఉపఎన్నికలో పోటీ విషయమై మిత్రులు భిన్నదారులు వెతుక్కుంటే.. వేర్వేరు దారుల్లో ఉన్నవారు ఏకతాటిపైకి వస్తున్నారా? బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందా? ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. రిప్లబిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ తర్వాత పొలిటికల్ కలర్స్ ఎటెటో వెళ్తున్నాయి. వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఈ క్రమంలో బూతులు..…
ఆంధ్రప్రదేశ్లో పని చేస్తున్న తెలంగాణ ప్రాంతవాసులకు గుడ్న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకోవాలని సూచించింది.. స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోనుంది సర్కార్.. తెలంగాణ తరహాలోనే ఏపీ కూడా ఆప్షన్లు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ స్థానికత.. స్పౌజ్ కేసులకు సంబంధించి సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా వేస్తోంది ఏపీ సర్కార్.. దీంతో.. సొంత ప్రాంతానికి వెళ్లాలని చూస్తున్న ఉద్యోగులకు ఊరట దక్కనుంది. ఇక,…
ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని డ్రగ్స్ వ్యవహారం నుంచి ఎలా బయట పడేయాలన్న బెరుకు, కంగారు సజ్జల మాటల్లో కనిపించాయి అని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. జగనుకు లేని క్యారెక్టర్ని ఎవరుఎలా నాశనంచేస్తారో సజ్జల చెప్పాలి అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, దోపిడీ అంతా పారదర్శకంగానే జరుగుతోందని సజ్జల గుర్తించాలి. 28 టన్నుల హెరాయిన్ రాష్ట్రంలోకి దిగుమతి అయితే ముఖ్యమంత్రి, డీజీపీ ఏం లేనట్లే మాట్లాడారు. కనీసం సజ్జలైనా ఈ వ్యవహారంలో తనచిత్తశుధ్దిని పరీక్షించుకోవాలి. ప్రభుత్వ…
డ్రగ్స్ వ్యవహారంలో ఏపీలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది.. అయితే, ఈ వ్యవహారంలోకి చంద్రబాబు ఫ్యామిలీని లాగుతోంది వైసీపీ.. చంద్రబాబు కుటుంబం డ్రగ్స్ బిజినెస్సులోకి దిగిందేమోననే అనుమానం వస్తోంది అంటూ హాట్ కామెంట్లు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… పెద్ద ఎత్తున హెరాయిన్ పట్టుబడిన ఈ సందర్భంలో లోకేష్ ఎక్కడున్నారు..? అని ప్రశ్నించిన ఆయన.. లోకేష్ దుబాయ్లో ఉన్నారని మాకు సమాచారం ఉందన్నారు. తమ డబ్బులను విదేశాల్లో దాచిన…
ప. గో జిల్లా : జనసేన పార్టీతో పొత్తుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. 2024 లో జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని… ఎలాంటి అనుమానాలు ఇందులో లేవన్నారు. జనసేన కి ఒక పాలసీ ఉంది.. తమకు ఒక పాలసీ ఉందని చెప్పారు. బిజెపి కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించదు….అందుకే బద్వేల్ లో పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు. భిన్న అభిప్రాయాలు సాధారణం… జనసేన తో మిత్ర పక్షం గా కొనసాగుతామని…