బద్వేల్‌లో వైసీపీ గ్రాండ్ విక్టరీ.. ఎవ్వరినీ వదలని సీఎం వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. ఏకంగా 90,533 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. ప్రతీ రౌండ్‌లోనూ వైసీపీ ఆధిక్యం సాదిస్తూ దూసుకెళ్లింది.. మొత్తంగా వైసీపీకి 1,12,211 ఓట్లు పోలుకాగా.. బీజేపీకి 21,678 ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీకి 6,235 ఓట్లు వచ్చాయి. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయాయి. ఇక, బద్వేల్ ఉప ఎన్నిక ఫలితంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎవ్వరినీ వదలకుండా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
బద్వేల్ గెలుపుపై సోషల్ మీడియాలో స్పందించిన సీఎం వైఎస్ జగన్.. ట్విట్టర్ ద్వారా నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.. బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్న ఏపీ సీఎం.. శాసన సభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.. ఇక, దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందన్న ఆయన.. ఈ గెలుపు ప్రజాప్రభుత్వానికి, సుపరిపాలనకు మీరిచ్చిన దీవెనలుగా భావిస్తూ.. మరింత మంచి చేసేందుకు కృషి చేస్తాను అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.
Also Read
బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో అఖండ విజయాన్ని అందించిన ప్రతి అక్కచెల్లెమ్మకు, అవ్వాతాతకు, ప్రతి ఆత్మీయ సోదరునికి పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శాసనసభ్యురాలిగా గెలుపొందిన డా. సుధమ్మకు నా అభినందనలు. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 2, 2021
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!