ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న ఆయన మళ్లీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆదివారం రాత్రి హుటాహుటిన అధికారులు ఆయన్ను ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు. ఆయన పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. Read Also: శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం తొలుత ఈనెల 15న గవర్నర్ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో…
1) నేటి నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం… వచ్చేనెల 23 వరకు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు.. సాగుచట్టాల రద్దు బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం.. లోక్సభ ఆమోదం తర్వాత ఈరోజే రాజ్యసభకు పంపే అవకాశం2) ఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు ప్రతిపక్షాల సమావేశం.. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో భేటీ కానున్న విపక్ష పార్టీలు3) ఢిల్లీ: ఈరోజు పార్లమెంట్ వరకు రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ వాయిదా వేసిన సంయుక్త కిసాన్…
ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమైన ఏపీ ఉద్యోగ సంఘాలు తమ కార్యాచరణ ప్రకటించాయి. ఇక తాజాగా ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఉద్యమానికి వెళ్లాలని ఉద్యోగుల నుంచి ఒత్తిడి వస్తుంది. ఉద్యోగుల కోసం ఆత్మాభిమానం చంపుకుని అందరిదగ్గరకూ తిరిగాం. ఉద్యోగులు దాచుకున్న 1600 కోట్లు ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. దాని పై స్పష్టత ఇవ్వాలి అని అన్నారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చూస్తున్నారు. ఆర్థిక మంత్రి అసెంబ్లీలో మాట్లాడిన తీరు ఉద్యోగులను…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల కిందట ఏపీ సీఎస్గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ వాస్తవానికి ఈనెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగించాలంటూ నవంబర్ తొలివారంలో సీఎం జగన్ కార్యాలయం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. Read Also: అనాధ…
ఏపీలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో వరదలు పోటెత్తుతున్నాయి. దీంతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పాఠశాలలకు రేపు(నవంబర్ 29) అధికారులు సెలవు ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. రాబోయే రెండు రోజుల్లో అవి తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. Read Also: కడప జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలు…
ప్రభుత్వం పై పోరాటానికి సిద్ధమవుతున్నాయి ఏపీ ఉద్యోగ సంఘాలు. పెండింగ్ డీఏ బకాయిలు, పీఆర్సీతో పాటు పలు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి ఉద్యోగ సంఘాలు. ఇవి నెరవేర్చే వరకు పోరాటానికి ఉద్యోగ సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. వచ్చే నెల నుంచి వివిధ రూపాల్లో నిరసన గళం విప్పనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన సీఎస్ కు నోటీసు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్ 7 నుంచి 10 వరకు అన్ని జిల్లాల్లో బ్లాక్ బ్యాడ్జీలతో…
పెదగంట్యాడ మండలం గంగవరంలో వెలసిన పెద అమ్మవారు ఆలయంలో కపిలేశ్వరానందగిరి స్వామీజీ నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో కన్వీనర్ సునీల్ థియోధర్. అక్కడ ఆయన మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వంలో అవినీతి కారణంగా మత్స్యకారులకు కేంద్రం అమలు చేస్తున్న పథకాలు పూర్తిస్థాయిలో చేరడం లేదన్నారు. నెల్లూరు ప్రాంతంలో డీఎంకే అండ ఉన్న తమిళనాడు ఫిషింగ్ మాఫియా మత్స్యకారుల వలలను నాశనం చేస్తోంది. ఇందులో వైసీపీ నాయకుల పాత్ర ఉంది అని ఆరోపించారు. మత్స్యకారుల సంక్షేమం…
కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని కోరినట్టు వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి… ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కనీస మద్దతు ధరను 24 పంటలకు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కల్పిస్తున్నారని గుర్తుచేశారు.. అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఇక, ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. దానిని సరిదిద్దాలని సూచించారు. అణగారిన బీసీలను గుర్తించేందుకు సామాజిక ఆర్థిక కుల…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. మూడు రోజుల పాటు ఏపీలో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణశాఖ సూచించింది. ఈ మేరకు ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే…