విశాఖ జిల్లాలో నాలుగు థియేటర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు అధికారులు. టిక్కెట్ ధరలు పెంచినట్టు గుర్తించడంతో యాజమాన్యాలను వివరణ కోరింది యంత్రంగం. ఈ రకమైన ఫిర్యాదులు తొమ్మిది సినిమాహాళ్లపై రావడంతో… థియేటర్ల నిర్వహణ, టిక్కెట్ ధరలు,లైసెన్సులపై జిల్లా యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అయితే సినిమా టికెట్ల ధరలు అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం జీవో 35ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ జీవోతో సినిమా డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఏపీ హైకోర్టు ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు ఉందని తెలుపుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 35ను రద్దు చేస్తూ తీర్పనిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.