ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని నిర్ణయించింది టీడీపీపీ… పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం ద్వారా పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు… Read Also: ఏపీ మూడు రాజధానుల కేసు.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, జ్యుడీషియల్ విచారణకి డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది..…
మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఇప్పటికే హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైందని… ఈ సమావేశంలో మూడు రాజధానులపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుందని కోర్టుకు విన్నవించారు. అయితే, రాజధాని కేసులపై సోమవారం విచారణ చేపట్టనుంది హైకోర్టు ధర్మాసనం. Read Also: కలవరపెడుతోన్న కోవిడ్ కొత్త…
నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పలు జిల్లాలు వరదలతో అతలాకుతలం అవుతుంటే టాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల అభిమానం వల్లే హీరోలు అయిన వాళ్లు.. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో, బాధల్లో ఉంటే స్పందించకపోవడం బాధాకరమన్నారు. చిరంజీవి, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. ఇలా ఒక్కరు కూడా వరద ప్రజల గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదని…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని బొత్స స్పష్టం చేశారు. లేనిది ఉన్నట్లుగా చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆడపడచుల ఆత్మగౌరవం పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని బొత్స ఆరోపించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే సంస్కృతి టీడీపీ నేతలకే ఉందన్నారు. ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టినప్పుడు చంద్రబాబుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదా అని బొత్స ప్రశ్నించారు. Read…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చుపై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. సీఎస్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపించింది. పీఎంవోకు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది. Read Also: రెండు దశాబ్దాలుగా నరసరావుపేటలో టీడీపీ డల్..! గతంలోనే ఎంపీ లాడ్స్ నిధుల దుర్వినియోగంపై ఏపీ సర్కారు…
మంత్రి కొడాలి నానిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య… కొడాలి నానికి తెలుగు నేర్పిన మాస్టర్ వస్తే కాళ్లకు దండం పెట్టాలని ఉందంటూ సెటైర్లు వేసిన ఆయన.. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ తర్వాత కేంద్రం చంద్రబాబుకి ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇచ్చింది.. చంద్రబాబు దేశ సంపద కాబట్టి కేంద్రం ఎన్ఎస్జీతో రక్షణ కల్పించిందన్నారు.. కానీ, కొడాలి నానిని ఆడవాళ్లు కొట్టకుండా సీఎం జగన్ సెక్యూరిటీ ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు.. నారా భువనేశ్వరిపై…
వరదల సమయంలోనూ అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. వరద సహాయక చర్యల్లో పాల్గొనడంలేదంటూ.. ఓవైపు అధికార పక్షాన్ని ప్రతిపక్షం విమర్శిస్తే.. మరోవైపు ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తోంది అధికార పార్టీ.. ఇక, టీడీపీ నేతలపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్‌గా మారాయి.. వరదల్లో టీడీపీ నేతలు ఎక్కడా కనపడలేదు… తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అన్నట్టుగా టీడీపీ పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు గోరంట్ల మాధవ్… అయిపోయిన పెళ్లికి…
ఏపీ సర్కారుపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి విమర్శలు చేశారు. ఏపీలో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదని… ఉన్న పరిశ్రమలు రాష్ట్రానికి బై చెప్తున్నాయని లోకేష్ ఆరోపించారు. టాటా గ్రూప్ 300 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సెమీకండక్టర్ పరిశ్రమను తెలంగాణ లేదా తమిళనాడు రాష్ట్రానికి తరలించాలని యోచిస్తోందన్నారు. లులూ గ్రూప్ కూడా ఏపీకి రాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయని లోకేష్ వివరించారు. Read Also:…
కోమరిన్ ప్రాంతం మరియు దానిని ఆనుకొని ఉన్న శ్రీ లంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించియున్నది. వేరొక అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రము లో సుమారు నవంబర్ 29 , 2021 వ తేదీకల్లా ఏర్పడవచ్చును ఇది తదుపరి 48 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణిం చే అవకాశం ఉంది. ఈరోజు తేలికపాటి వర్షాలు ఒకటి లేక…