ఏపీలో మరో కొత్త పథకం.. శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేని ఇళ్లపై యజమానులు పూర్తి హక్కు పొందేందుకు వీలుగా వైసీపీ సర్కార్.. ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపై అనేక విమర్శలు కూడా లేకపోలేదు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహా విపక్షాలు అన్నీ ఈ పథకంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.. అయితే, ఈ పథకాన్ని ఈ నెల 21వ తేదీన ప్రారంభించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ (ఓటీఎస్) కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం డబ్బులను వసూలు చేసింది..
Read Also: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. అక్కడ ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్..
Also Read
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
తణుకులో సీఎం వైఎస్ జగన్ పర్యటన ఇలా కొనసాగనుంది.. 21వ తేదీన ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు సీఎం వైఎస్ జగన్.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలకు చేరుకోనున్న ఆయన.. అక్కడ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు’ స్కీమ్‌ను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరుగు ప్రయాణమై.. మధ్యాహ్నం 1.50 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు ఏపీ సీఎం.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
-
Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
-
Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..