ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోకి వారికి నో ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది… సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్ రైటర్లకు నో ఎంట్రీ అంటూ స్పష్టం చేసింది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్లు సహా అనధికార వ్యక్తులకు ప్రవేశాన్ని నిషేధించినట్టు వెల్లడించారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ.. ఈ మేరకు మెమో జారీ చేశారు… కాగా, అనధికార వ్యక్తుల ప్రమేయం వల్లే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పేర్కొంది.. డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ వెండర్స్ వల్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఏర్పడుతోందని తన నివేదికలో పేర్కొంది ఏసీబీ.. తాము సీజ్ చేసిన లెక్కల్లోకి రాని నగదు డాక్యుమెంట్ రైటర్లు.. స్టాంప్ వెండర్ల ద్వారానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు చేరిందని తెలిపింది..
Read Also: పసిడి ధర ఇవాళ ఇలా..
Also Read
ఇక, ఏసీబీ అబ్జర్వేషన్లను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతున్నారు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఐజీ రామకృష్ణ.. అందుకే అనధికారిక వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.. అయితే, ఐజీ ఆదేశాలపై డాక్యుమెంట్ రైటర్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థనే అవినీతి వ్యవస్థగా చిత్రీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, ఫేక్‌గాళ్లు రెచ్చిపోయి అవినీతిలో కొత్తదారులు తొక్కుతూ.. రాష్ట్ర ఖజానాకు కోట్లలో గండి కొట్టిన సంగతి తెలిసిందే.. నకిలీ చలాన్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది.. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్ద స్కామ్‌లు వెలుగుచూశాయి.. అన్ని జిల్లాల్లోనూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ తనిఖీలు చేపట్టడంతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కోసం చెల్లించే చలానాలను కొందరు దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. రిజిస్ట్రేషన్ కోసం బ్యాంకుల్లో చలానా తీసి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాక.. కొందరు అవే చలానాలను మళ్లీ వినియోగిస్తున్నారని దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!