డిసెంబర్ నెలకు సంబంధించి సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఈరోజు ఉదయం 9 గంటలకు టికెట్లను విడుదల చేసింది. ఆన్లైన్లో విడుదల చేసిన 13 నిమిషాల వ్యవధిలోనే 2.80 లక్షల టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గత మాసంలో 2.40 లక్షల టికెట్లను 19 నిమిషాల వ్యవధిలో భక్తులు పొందగా, ఇప్పుడు కేవలం 13 నిమిషాల వ్యవధిలోనే 2.80 లక్షల టికెట్లు పొందడం విశేషం. డిసెంబర్ నెలకు సంబంధించి 3.10 లక్షల టికెట్లను టీటీడీ…
డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతున్నారు కొందరు.. అందులో చదువుకున్నవారు కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ఉన్నత చదువు చదువుకొని.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన ఒక యువకుడు తక్కువకాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి అడ్డదారి తొక్కి జైలుపాలయ్యిన ఘటన విజయవాడలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. విజయవాడ ఫకీరుగూడెం కు చెందిన సోహైల్(21) అనే యువకుడు కష్టపడి చదువుకొని సాఫ్ట్ వేర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆ ఉద్యోగంలో ఆశించినంత డబ్బు రాకపోవడంతో అడ్డదారి పట్టాడు.…
ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే ప్రజల్లోకి వెళ్లాలని ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ విషయాన్ని ఆయన కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తాడో పేడో తేల్చుకుంటామని ఆ సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అటు చంద్రబాబు, ఇటు లోకేష్ జిల్లాలలో విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై శుక్రవారం…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతోన్న తరుణంలో లోక్సభ, రాజ్యసభలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. సచివాలయంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన ఆయన.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు మార్గ నిర్దేశం చేశారు.. ఎంపీలకు సీఎం వైఎస్ జగన్ సూచనలు: పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల రూ. 55,657 కోట్ల ఆమోదానికి కృషి చేయాలి. జాతీయ హోదా ప్రాజెక్టు అంటే విద్యుత్తు,…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారం… బీఏసీలో ప్రతిపక్షం అడిగిన విధంగా అసెంబ్లీ సమావేశాలు పొడిగించాం.. అయినా చర్చించటానికి అంశాలేమీ లేక టీడీపీ కావాలని డ్రామాలు ఆడి బయటకు వెళ్లి పోయిందని అధికార పార్టీ ఆరోపించింది… టీడీపీ అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.. అయినా ఎందుకు పారిపోయారో అర్థం కాలేదని మండిపడ్డారు.. మొత్తంగా ఏడురోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశల్లో 26…
దేశవ్యాప్తంగా పేద ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్లో పేదరికంలో మగ్గుతున్న వారి సంఖ్య పెరిగినట్లు నీతిఆయోగ్ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా పేదరికం సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. నిరుపేదలు ఎక్కువ ఉన్న రాష్ట్రాల జాబితాలో బీహార్ అగ్రస్థానంలో ఉంది. బీహార్లో 51.91 శాతం మంది పేదలు ఉన్నారని మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) ద్వారా నీతి ఆయోగ్ తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్…
ఏపీలో ఈరోజు కరోనా కేసులు స్థిరంగా ఉన్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29,731 శాంపిల్స్ పరీక్షించగా.. 184 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ బాధితులు ఒక్కరు ఈరోజు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 214 మంది కోవిడ్ నుంచి పూర్తి స్థాయి లో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,16,261…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆయన నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ఇటీవల సభలో చంద్రబాబు మైక్ కట్ చేసిన సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు టీడీపీ సభ్యులు ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీ స్పీకర్ సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించినట్లు…
శుక్రవారం నాడు హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కీలక అఫిడవిట్లను సమర్పించింది. పాలన వికేంద్రీకరణ రద్దు, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అఫిడవిట్లను ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ హైకోర్టులో దాఖలు చేసింది. ఈ అంశాలపై గతంలో పిటిషన్ దాఖలు చేసిన వారికి అఫిడవిట్ల కాపీలను ప్రభుత్వం పంపింది. ఈనెల 22న అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని, సీఆర్డీఏ బిల్లు చట్టాన్ని ఉపసంహరించుకుని బిల్లులు ఆమోదించినట్లు ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ఇదే బిల్లులను ఈనెల 23న శాసనమండలిలో కూడా ఆమోదించినట్లు ప్రభుత్వం…