మహిళలపై దాడి చేయాలంటే వణుకు పుట్టేలా చర్యలు చేపట్టాం… దిశ యాప్ తో మహిళల దశ మారుతుంది అని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు వాహనాలు చెడిపోయినా దిశా యాప్ ను ఆశ్రయిస్తున్నారు… మహిళా రక్షణ కు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే అందుకు కారణం. ప్రకృతి వైపరీత్యాలను ఆపలేం… కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ఎలాగో మా ప్రభుత్వానికి తెలుసు. ముఖ్యమంత్రిపై కామెంట్లు చేసి ప్రజాగ్రహాన్ని టిడిపి చవిచూసింది. వైసీపీ…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ అల్పపీడనం అండమాన్ దీవుల వరకు వ్యాపించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ అల్పపీడనం పశ్చి వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి డిసెంబర్ 2 వ తేదీ వరకు వాయుగుండంగా మారి డిసెంబర్ 3 వ తేదీ వరకు బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. డిసెంబర్ 4 వ తేదీన ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరమునకు చేరవచ్చని వాతావరణ శాఖ…
ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మరోసారి లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈసారి గ్రామపంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ.1,309 కోట్లు తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం ఈ మూడు మార్గాల ద్వారానే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన…
విద్యార్థుల తల్లిదండ్రులకు మరోసారి గుడ్‌న్యూస్ చెప్పారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. జగనన్న విద్యాదీవెన కింద మూడో త్రైమాసికం డబ్బులు చెల్లించారు.. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విద్యాదీవెన డబ్బులను విడుదల చేశారు సీఎం వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం వల్ల అక్షరాల 11.03 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుందని వెల్లడించారు.. మూడో త్రైమాసికం పూర్తయిన వెంటనే నేరుగా తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నామన్న ఆయన.. పూర్తి ఫీజు…
ఆంధ్రప్రదేవ్‌లో పేదళ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.. పేదలందరికీ ఇళ్ల పథకం విషయంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది డివిజన్ బెంచ్.. దీంతో, ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు పిటిషనర్లు తెలిపారు.. కాగా, గత నెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దంటూ తీర్పు వెలువరించింది హైకోర్టు సింగిల్ బెంచ్… అయితే, సింగిల్ బెంచ్…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కాల్ మనీ వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.. కృష్ణా జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం సంచలనంగా మారింది.. కాల్ మనీ మాఫియా వేధింపులు భరించలేక ఓ వీఆర్వో ఆత్మహత్య చేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లాలోని ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన గౌస్ అనే వ్యక్తి వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు.. ప్రస్తుతం కొండపల్లి గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్న ఆయన.. వడ్డీ వ్యాపారస్తుల వద్ద కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పుగా తీసుకున్నాడు..…
మరో నెలలో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పి 2022 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవులపై ఆసక్తి ఉంటుంది. ఈ మేరకు 2022 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 17 సాధారణ, 18 ఆప్షనల్ హాలీడేస్ ఇచ్చారు. Read Also: గుడ్‌న్యూస్.. నేడే విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.686 కోట్లు సాధారణ సెలవులు: జనవరి 14-భోగి,…
ఏపీలో బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల ఫీజుల్ని జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే ప్రభుత్వం వెంటనే ఫీజు డబ్బులను చెల్లిస్తోంది. ఈ ఏడాది మూడో విడతగా దాదాపు 11.03 లక్షల మంది విద్యార్ధులకు రూ. 686 కోట్లను మంగళవారం నాడు సీఎం జగన్ తన క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి నేరుగా వారి తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. Read Also: కేవలం…
కరోనా వైరస్‌కు మందు తయారుచేసిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన త్వరలోనే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆనందయ్య స్వయంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆనందయ్య సోమవారం నాడు విశాఖ జిల్లా అనకాపల్లిలోని నూకాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. Read Also: మంచి మనసు చాటుకున్న టీమిండియా కోచ్ ద్రవిడ్ అనంతరం ఆయన…
వర్షాల ఎఫెక్ట్‌తో కూరగాయల ధరలు కొండెక్కుతున్నాయి… నిన్న మొన్నటి వరకు కిలో టమాటా వందకు పైగా పలకగా… ఇప్పుడు వంకాయ వంతు వచ్చింది.. హోల్‌సెల్ మార్కెల్లోనే కిలో వంకాయ ధర రూ.100కు చేరింది.. ఇక, బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి కిలో రూ.150 వరకు పలుకుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు.. మొత్తంగా కూరగాయల్లో రారాజుగా పిలవబడే వంకాయల ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి.. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం మడి అంత ర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో రికార్డు స్థాయికి చేరింది…