రేపు తిరుపతిలో చంద్రబాబు సతీమణి పర్యటన.. వరద బాధితులకు సాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అకస్మాత్తుగా సంభవించిన వరదలతో చాలామంది నష్టపోయారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సాయం అందించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 20న తిరుపతిలో పర్యటించనున్నారు. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున మృతుల కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. కాగా వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు నారా భువనేశ్వరి ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ వెల్లడించింది.
కాగా ఏపీ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల అనంతరం నారా భువనేశ్వరి ఏపీలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీలో తన భార్యను అవమానించారని చంద్రబాబు కన్నీటి పర్యంతమైన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల వ్యాఖ్యలపై వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. మరోవైపు ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పలువురు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. గతంలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, మహేష్, ప్రభాస్, అల్లు అరవింద్ వంటి ప్రముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు అందించారు. వరద బాధితులకు అండగా ఉంటామని సీఎం జగన్ కూడా ప్రకటించారు.
Also Read
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!