✍ నేడు ఏపీ హైకోర్టు అదనపు భవనానికి శంకుస్థాపన… హాజరుకానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా✍ కర్నూలు: నేడు డోన్ ప్రభుత్వాస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం… వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం జగన్✍ అమరావతి: నేడు వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష… హాజరుకానున్న మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులు.. వ్యాక్సినేషన్‌పై ప్రధానంగా చర్చించే అవకాశం✍ నేడు తమిళనాడు వెళ్లనున్న తెలంగాణ సీఎం కేసీఆర్… శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న కేసీఆర్……
పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అమరావతి ఒకటే రాజధాని కావాలని అంటున్నాడు పవన్ కళ్యాణ్. కానీ గతంలో చెప్పిన మాటలు మర్చిపోయావా అని ప్రశ్నించారు. జనసేనను అధికారంలోకి తీసుకుని రావాలని అడిగే హక్కు ఉందా అని అడిగిన ఆయన విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే ధైర్యం లేదా అన్నారు. విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆస్తి. అయినా ఇలా అమ్మటం అన్యాయం అని అవకాశం ఉన్న ప్రతి సందర్భంలోనూ చెబుతూనే ఉన్నాం.…
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గొయ్యి తీసి పాతి పెట్టారు చంద్రబాబు. బీజేపీతో పార్ట్ నర్ గా ఉండి ప్రైవేటీకరణకు ఏది ఇచ్చినా ఆవు కథ వ్యాసం రాసే వారిలా ఉంది పవన్ కళ్యాణ్ వైఖరి. విశాఖ ఉక్కు గురించి దీక్ష చేస్తున్న అన్న పవన్ కళ్యాణ్ ఉపన్యాసం లో ఎక్కడా విశాఖ ఉక్కు ప్రస్తావనే లేదు. ఉపన్యాసం అంతా జగన్ కు 151…
ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌ను పేరడీ చేశారు. ఈ సాంగ్‌ను వైసీపీ సర్కారు పాలనతో లింకు పెడుతూ.. నా పాలన సూడు.. నా పాలన సూడు.. వేస్టు వేస్టు.. వేస్టు వేస్టు అంటూ ఎద్దేవా చేశారు. Read Also: కావాలంటే నా సినిమాలను ఏపీలో ఉచితంగా ఆడిస్తా: పవన్ కళ్యాణ్ ‘అప్పులోళ్ళ ఖాతాల్లో వడ్డీ రేట్లు…
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన దాఖలాలు ఏవైనా ఉన్నాయా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరిలో ఒక్కరోజు నిరాహారదీక్ష చేపట్టిన ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వైసీపీ నేతలు చేసిన పాపాలకు ప్రాజెక్టులే కొట్టుకుపోతున్నాయని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు.…
హెటేరో ఫార్మా కంపెనీ పైపులైన్ కు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించింది టీడీపీ. నక్కపల్లి(మం)రాజయ్యపేట దగ్గర మత్యకారులు దీక్షా శిబిరాన్ని సందర్శించారు తెలుగు మహిళ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. అయితే నేటితో 12వ రోజుకు చేసుకుందిమత్స్యకారుల శాంతియుత ధర్నా. అక్కడ ఆవిడ మాట్లాడుతూ… సముద్రంలోకి పంపుతున్న రసాయన వ్యర్థజలాలు వల్ల మత్యసంపాద నశించుపోతుంది. మత్యకారులు అందరూ కూడా వలసలు వెళ్లి బ్రతకావలసిన పరిస్థితి వచ్చింది. అనుమతులు లేకుండా పైపులైన్ వేస్తుంటే అధికారులు…
తన సినిమాల విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. 2014లో ఓట్లు చీల్చకూడదనే తాను పోటీ చేయలేదన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చేంత వరకు భరించక తప్పదన్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ తప్పులకు సమాధానం చెప్పిస్తామన్నారు. సిగరెట్లు తాగితే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా.. ఏపీలో ప్రజల ఆరోగ్యానికి వైసీపీ హానికరమని పవన్ ఆరోపించారు. ఏపీలో తమ…
కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తొస్తోంది. రేపు ఓటేసేటప్పుడు కూడా జనానికి జనసేనే గుర్తుకు రావాలి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీని మేం శత్రువుగా చూడడం లేదు.. కానీ ఆ ప్రభుత్వ విధానాలు సరిగా లేకుంటే మేం విమర్శలు చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ గురించి అడిగితే పచ్చి బూతులు తిడతారు.. ఇంట్లో వాళ్లని తిడతారు. స్టీల్ ప్లాంట్ అంటే ఏదో చిన్న పరిశ్రమ కాదు.. ఆత్మగౌరవం. నేను బీజేపీతో చిటికి మాటికి గొడవలు పెట్టుకోవాలని…
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్ష ముగిసింది. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పరిశ్రమ మాత్రమే కాదని.. ఆంధ్రుల ఆత్మగౌరవమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను వెళ్లి కేంద్రంతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. Read Also: అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు…