టాలీవుడ్ హీరోయిన్లలో సమంత గత కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లో ఉంటోంది. ఒకవైపు నాగచైతన్యతో విడాకుల గొడవ.. మరోవైపు పుష్పలో ఐటం సాంగ్ వంటి విషయాలతో సమంత వార్తల్లో నిలుస్తోంది. దీంతో సమంత క్రేజ్‌ను పలు వ్యాపార సంస్థలు కూడా క్యాష్ చేసుకుంటున్నాయి. తాజాగా కడప పట్టణంలో ఆదివారం నాడు హీరోయిన్ సమంత సందడి చేసింది. కడప ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరైంది. Read…
ఆంధ్రప్రదేశ్‌లో రోజువారి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈరోజు స్థిరంగా ఉంది… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,859 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 160 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది… ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందరు. ఇదే సమయంలో 201 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. ఇక, ఇవాళ్టి టెస్ట్‌లతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,07,77,396 కు చేరింది.. మొత్తం…
సిల్క్ డెవలప్మెంట్ స్కాం కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించింది కోర్ట్. అయితే ఈ రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెల్లడయ్యాయి. 2015 జూన్ లోనే కుంభకోణానికి శ్రీకారం చుట్టినట్లు తేల్చిన రిమాండ్ రిపోర్ట్… జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్ లకు దురుద్దేశ పూర్వకంగా సీమెన్స్ ప్రాజెక్టు సొమ్ము 241 కోట్లను ప్రభుత్వ భాగస్వామ్యంగా ఇచ్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఈ…
విజయవాడలో జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 340 మంది పబ్లిషర్స్ ఈ బుక్ ఫెయిర్‌కు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 32వ బుక్ ఫెయిర్‌ను విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కాలేజీలో నిర్వహిస్తామని బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్ కుమార్ వెల్లడించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు…
ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. మంగళగిరిలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించుకునేందుకు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షకు దిగిన పవన్‌ను అమరావతి ప్రాంత మహిళా రైతులు కలిశారు. తొలి నుంచి అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉన్న పవన్‌కు కృతజ్ఞతలు చెప్పిన వారు.. ముగింపు సభకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానం పట్ల పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు అమరావతి ప్రాంత మహిళా రైతులు వెల్లడించారు.…
వాళ్లంతా ఏపీలోని కీలక ఆలయానికి చెందిన పాలకవర్గ సభ్యులు. పైగా అధికారపార్టీ నేతలు. సమావేశాల్లో దున్నేయొచ్చని.. కనుసైగలతో శాసించొచ్చని ఎన్నో లెక్కలు వేసుకున్నారట. కానీ.. టీ.. కాఫీలకే పరిమితమై ఉస్సూరుమంటున్నారు. ఇంతకీ ఏంటా ఆలయం.. ఎవరా పాలకవర్గ సభ్యులు? పాలకవర్గ సభ్యులను పట్టించుకోవడం లేదట..! బెజవాడ ఇంద్రకీలాద్రి. ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కనకదుర్గమ్మ గుడిలో.. గతంలో వివాదాలు అదేస్థాయిలో ఉండేవి. ఈ ఆలయానికి 15 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు.…
ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐర్లాండ్ నుంచి ముంబాయి మీదుగా విశాఖకు వచ్చిన ప్రయాణికుడికి ఒమిక్రాన్ వైరస్ సంక్రమించింది. విజయనగరం జిల్లాలో రెండు దఫాలుగా ఆర్టీపీసీఆర్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్ సీసీఎమ్బీకి శాంపిల్స్ పంపారు అధికారులు. జీనోమ్ సీక్వెన్స్ లో ఒమిక్రాన్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేసింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. దీంతో అలెర్ట్ అయింది…
కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై శనివారం మధ్యాహ్నం హత్యాయత్నం జరిగింది. కోస్గి మండలం పెద్దభూంపల్లిలో రథోత్సవంలో పాల్గొన్న తిక్కారెడ్డిపై దాడి చేసేందుకు ప్రత్యర్థులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై తిక్కారెడ్డిని కాపాడారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కాగా స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. Read Also: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలో చర్చ అయితే టీడీపీ సీనియర్ నేత తిక్కారెడ్డిపై హత్యాయత్నం జరగడంపై టీడీపీ జాతీయ…
ఆయనో అధికారపార్టీ ఎమ్మెల్యే. వరసగా రెండోసారి గెలిచారు. కాకుంటే కాస్త డిఫరెంట్. పార్టీలో ఉంటారు.. అప్పుడప్పుడూ పార్టీకి గిట్టని పనులు కూడా చేస్తుంటారు. మరోసారి టికెట్ రాదని అనుమానం వచ్చిందో ఏమో .. ముందే జాగ్రత్త పడుతున్నారని ప్రచారం మొదలైంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలను అందుకు సంకేతాలుగా చెబుతున్నారు. మరి.. ఆ ఎమ్మెల్యే కొత్తదారిలో ప్రయాణిస్తారా? కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై వైసీపీలోనే అసంతృప్తి ఉందా? కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే. రాజకీయాల్లో ఆయన…
సాధారణంగా ఉల్లిగడ్డలు తరిగేటప్పుడు కన్నీరు వస్తుంది. కానీ తరగకుండానే రైతులకు ఉల్లిగడ్డలు కన్నీరు పెట్టిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఒక్కసారిగా ఉల్లిపాయల ధరలు పడిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఉల్లి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళనకు దిగారు. Read Also: ఇద్దరు టీడీపీ నేతలను సస్పెండ్ చేసిన చంద్రబాబు శనివారం రోజు కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు…