కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. దాదాపు గంటసేపు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఏర్పాటు చేయాలనుకున్న జాతీయ రహదారికి సంబంధించిన డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, ఈ రహదారి నిర్మాణం ద్వారా విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గడ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని సీఎం జగన్ కేంద్ర మంత్రికి వివరించారు.
Read: ఆ దేశ అధ్యక్షుడికి తీవ్ర అస్వస్థత… వైద్యం చేయవద్దంటున్న నెటిజన్లు…
సముద్ర తీరాన్ని ఆనుకొని బీచ్ కారిడార్ ప్రాజెక్టులకు సమీపం నుంచి ఈ రహదావి వెళ్తుందని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేందుకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. అదే విధంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖ నగరంలో వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని 6 లైన్న రహదారిని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. విజయవాడ తూర్పు బైపాస్‌పై గతంలో చేసిన విజ్ఞప్తిని చురుగ్గా పరిశీలించాలని, సంబంధిత శాఖల సమన్వయంతో భూ సేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. ప్రాజెక్టు ఖర్చులను తగ్గించేందుకు ఎస్జీఎస్టీ, రాయల్టీ మినహాయింపులు ఇస్తామని, వీతైనంత త్వరగా ప్రాజెక్టులు చెపట్టాలని నితిన్ గడ్కరీని కోరారు. అదేవిధంగా కత్తిపూడి-ఒంగోలు కారిడార్‌లో భాగంగా ఎన్‌హెచ్ 216 నిర్మాణానికి సంబంధించి బాపట్లలో 4 లైన్ల రోడ్డుగా విస్తరించాలని సీఎం జగన్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.