తిరుమల తిరుపతి దేవస్థానం మూడో ఘాట్ రోడ్డు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈరోజు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. తిరుమలకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు మూడో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నది. పదకవితా పితామహుడిగా పేరుగాంచిన అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నది. ఈ మార్గంలో ప్రయాణం చేస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుతారు. Read:…
చంద్రబాబు పై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సెటైర్లు వేశారు. అఖండ సినిమా చూసిన ఫ్రస్టేషన్ తో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉన్నారు. చంద్రబాబు చూడాల్సింది జస్టిస్ చంద్రు మాట్లాడిన వీడియో…. ఆ వీడియోలు చూసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్ని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో టీడీపీ స్కిల్ తో చేసిన స్కాంను బయట పెట్టాల్సి న బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉంది. స్ట్రా వేసి తమ ఐదేళ్ళ కాలంలో ఎంతో…
బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుకు కోపం వచ్చింది. రాజకీయాలను రాజకీయాలుగా చూడకుండా.. పాత విషయాలను పదేపదే ప్రస్తావించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారా? అందుకే ఎన్నడూ లేనివిధంగా అధికారపార్టీపై విరుచుకుపడ్డారా? అయితే 2024 తర్వాత రాజకీయాలకు గుడ్‌బై కొట్టేస్తానని ఎందుకు చెప్పారు? ఇది ఆగ్రహమా..? అసహనమా..? 2024 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన..! ప్రత్యర్థులను.. అందులోనూ టీడీపీని.. ఆ పార్టీ నేతలను విమర్శించడంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫ్రంట్ లైనులో ఉంటారు. అలాంటిది అధికార…
ఏపీలో వైసీపీ పాలనపై నటుడు అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు. ఏపీలో అన్ని వర్గాలకు సీఎం జగన్ సమన్యాయం చేస్తున్నారని అలీ కొనియాడారు. టాలీవుడ్‌కు సమస్యగా మారిన ఆన్ లైన్ టిక్కెట్ల విధానం, బెనిఫిట్ షోల వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అలీ పేర్కొన్నారు. దీనిపై జగన్ సానుకూలంగానే ఉన్నారని భావిస్తున్నట్లు అలీ తెలిపారు. Read Also: ఏపీలో…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ టాలీవుడ్‌కు ఊపిరి పోసిందని చిత్ర ప్రముఖులందరూ భావిస్తున్నారు. తాజాగా అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందించారు. అఖండ మూవీని తాను ఇటీవల చూసినట్లు చంద్రబాబు ఈరోజు ప్రెస్మీట్లో వెల్లడించారు. మంగళగిరి టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన బాబు.. ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారని… సినిమా చాలా…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం…
సీఎం జగన్‌కు నారా లోకేష్ లేఖ రాశారు. గిరిజనులకు పథకాలు దూరం చేసే అడ్డగోలు నింబధనలు తొలగించాలని లేఖలో పేర్కొన్నారు నారా లోకేశ్. గిరిజనులకు నిలిపివేసిన పెన్షన్, రేషన్‌ను పునుద్దరించాలని కోరారు. 10 ఎకరాల భూమి, వాహనం ఉంటే సంక్షేమ పథకాలు నిలిపివేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఈ నిబంధనలు ఆదివాసీల పాలిట శాపంగా మారాయన్నారు. గిరిజన ప్రాంతాల్లో చాలా మంది ఏడాది ఆదాయం 25 వేలు కూడా ఉండదన్నారు. గిరిజనులకు పథకాలను…
ఏపీలో న్యాయపరమైన వ్యవహరాలపై జస్టిస్ చంద్రు కీలక కామెంట్లు చేశారు. ఏపీలో న్యాయ వ్యవస్థ ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని…హైకోర్టు తీర్పు ఇవ్వకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని చట్టాలను ఉపసంహరించుకుందని వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం కోర్టులను ఎదుర్కొలేక చట్టాన్ని ఉప సంహరించు కుందని…ఏపీ హైకోర్టులో రాజధాని కేసుల విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములు ఉన్నాయని వెల్లడించారు. విచారణ చేపడుతున్న కొందరు న్యాయమూర్తులకు అమరావతిలో భూములున్నాయని ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది.. ఆ జడ్జీలు…
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి… బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి సదరు ఎంపీపై బెదిరింపులకు దిగాడు.. దీంతో.. తుళ్లూరు పోలీసులను ఆశ్రయించిన ఎంపీ పీఏ… ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు.. ఇక, రంగంలోకి దిగిన తుల్లూరు పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా కూలిలాగడంతో.. ఫోన్ చేసిన వ్యక్తి బాబూరావుగా గుర్తించారు.. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాబూరావును అదుపులోకి తీసుకుని…
రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మీనారాయణకు నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడీ… లక్ష్మీనారాయణ ఇంట్లో ఇవాళ సోదాలు నిర్వహించింది ఏపీ సీఐడీ.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఓఎస్డీగా పనిచేసిన ఆయన.. పదవీ విరమణ తర్వాత ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా సేవలందించారు. యువతకు ట్రైనింగ్ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు రావడంతో.. ఇవాళ లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు.. Read Also: శ్రీవారి…