ప్రభుత్వం అంటే సవాలక్ష ఖర్చులు ఉంటాయి.. ఓవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ప్రాజెక్టులు, ఇంకోవైపు జీతాలు, పెన్షన్లు.. అబ్బో ఒక్కటేంటి.. అదో పెద్ద మహాసముద్రమే.. అయితే, ఆర్థికంగా బాగా ఉన్న రాష్ట్రాలతో పాటు, పెద్ద రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ వ్యవయమే ఎక్కువని తేల్చింది కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్).. ఉద్యోగుల జీతభత్యాలపై ఏపీ సర్కార్ కంటే.. మిగతా రాష్ట్రాలు తక్కువగా ఖర్చు చేస్తున్నాయని కాగ్ పేర్కొంది.. 2021–2022 తొలి ఏడు నెలల గణాంకాలను అంటే ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు అయిన వ్యయంపై నివేదిక విడుదల చేసింది కాగ్.. ఈ ఏడు నెలల్లో జీతాలు, పెన్షన్ల వ్యయం దాదాపు రూ.36వేల కోట్లకు పైగా అయినట్టు గణాంకాలతో సహా పేర్కొంది.. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే.. మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలే కాదు.. అధికరాబడి ఉన్నట్టువంటి గుజరాత్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఆ వ్యవయం తక్కువే అంటోంది కాగ్.
Read Also: జనవరి 5, బుధవారం దినఫలాలు…
ఓవైపు కరోనా ఆర్థికంగా దెబ్బకొట్టినా.. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా.. కరోనా మహమ్మారి సమయంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ప్రజల ఆరోగ్య రక్షణపై రూ.8వేల కోట్లు అదనంగా వెచ్చించినట్టు కాగ్ పేర్కొంది.. ఓవైపు కోవిడ్ దెబ్బకొట్టినా.. క్రమం తప్పకుండా ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లను చెల్లిస్తూ వస్తోందని.. తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీ 2021–22లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వేతనాలు, పెన్షన్ల కోసం రూ.36,006.11 కోట్లు వెచ్చించిందని కాగ్ నివేదిక వెల్లడించింది. ఇక, అందులో రూ.24,681.47 కోట్లు వేతనాల కోసం ఖర్చు చేస్తే.. పెన్షన్ల కోసం రూ.11,324.64 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదికలో వెల్లడించింది కాగ్.