★ నేటి నుంచి ఈనెల 9 వరకు తిరుపతిలోని ఇందిరా మైదానంలో జాతీయ కబడ్డీ పోటీలు
★ మంగళగిరిలో నేడు రెండో రోజు పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం.. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల ఇంఛార్జులతో భేటీ కానున్న చంద్రబాబు
★ 750వ రోజుకు చేరిన అమరావతి రైతుల పోరాటం… రాజధాని గ్రామాల్లో అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు.. ఆగిన అమరావతి నిర్మాణం-అభివృద్ధిలో వెనుకబడిన ఆంధ్ర పేరుతో సదస్సులు.. వెలగపూడి, తుళ్లూరు, మందడంలో ప్రజాచైతన్య సదస్సులు
★ తెలంగాణ హైకోర్టులో నేటి నుంచి ఆన్‌లైన్‌లో కేసుల విచారణ… కోవిడ్ ఎఫెక్టుతో భౌతిక విచారణను నిలిపివేసిన హైకోర్టు
★ బండి సంజయ్ అరెస్టుపై తెలంగాణ వ్యాప్తంగా నేడు రెండో రోజు బీజేపీ నిరసనలు… ఉ.11 గంటల నుంచి మ.12 గంటల వరకు బీజేపీ స్వచ్ఛభారత్
★ పంజాబ్: నేడు ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని మోదీ పర్యటన… రూ.42,750 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ… ఢిల్లీ-అమృత్‌సర్, కత్రా ఎక్స్‌ప్రెస్ వే, ఫిరోజ్‌పూర్‌లోని పీజీఐ శాటిలైట్ సెంటర్, హోషియార్‌పూర్‌లో మరో రెండు మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న మోదీ
★ ఢిల్లీ: నీట్, పీజీ కౌన్సెలింగ్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
★ సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి నుంచి యాషెస్ నాలుగో టెస్టు