విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ ఈ మధ్య కలకలం సృష్టిస్తోంది… విజయవాడ, అమరావతి, తాడేపల్లి ప్రాంతాల్లో పలు చోట్ల చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్.. దీంతో రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు… ఈ కేసులో పురోగతి సాధించారు.. రెండు గ్యాంగ్‌లకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.. చెడ్డీ గ్యాంగ్ చోరీ ఘటనల సీసీటీవీ ఫుటేజీని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కూడా పంపించారు బెజవాడ పోలీసులు. తాడేపల్లి చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలోని చెడ్డీ గ్యాంగ్ సభ్యులను గుజరాత్ పోలీసులు…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఇవాళ ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 29, 228 శాంపిల్స్ పరీక్షించగా.. 132 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఒక్క కోవిడ్ బాధితుడు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 186 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,08,27,634 కు…
ఏపీలో వేతనాలు, పెన్షన్లపై చీఫ్ సెక్రెటరీ లెక్కలు ఉద్యోగుల్నీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు. 111 శాతం ఖర్చు చేస్తున్నట్టు అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పించన్లపై రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని అన్నారు. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని, రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎందుకు ఈ విషయం…
చిత్తూరు జిల్లా నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో తిరుపతిలో దిగాల్సిన విమానం బెంగళూరులో సురక్షితంగా ల్యాండైంది. Read Also: అమరావతి రాజధాని రైతులకు టీటీడీ గుడ్ న్యూస్ వాస్తవానికి ఎమ్మెల్యే రోజా ప్రయాణిస్తున్న విమానం రాజమండ్రి నుంచి తిరుపతి రావాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా ఎక్కిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం తిరుపతికి ఈరోజు ఉ.10:55 గంటలకు చేరుకోవాల్సి ఉంది. కానీ…
అమరావతి రాజధాని రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్తను అందించింది. రైతులు పెద్దసంఖ్యలో ఒకేసారి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు అనుమతి జారీ చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ బుధవారం ఉదయం 500 మంది రైతులు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చని సూచించింది. Read Also: అయ్యప్ప భక్తులకు శుభవార్త… తెలంగాణ నుంచి శబరిమలకు 200 బస్సులు కాగా ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో 44 రోజుల పాటు…
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో క్యాన్సర్ బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు క్యాన్సర్ బాధితులకు ఉత్తమ చికిత్స అందించేందుకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో కనీసం మూడు క్యాన్సర్ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఏపీలో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీల ఆస్పత్రులు లేకపోవడం వల్ల ప్రజలు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు తరలి వెళ్లాల్సి వస్తోందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు…
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఖరారు చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఈనెల 15 వరకు 112.5 టీఎంసీల నీటి వినియోగానికి బోర్డు ఆమోదం తెలిపింది. జూన్ 1 నుంచి నవంబర్ 30 వరకు రెండు ప్రాజెక్టుల కింద ఏపీ, తెలంగాణ కలిపి 294.33 టీఎంసీల నీటిని వాడుకున్నాయి. బోర్డు తాజా నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా మరో 407 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం దక్కించుకున్నాయి. Read…
✍ ఢిల్లీ: నేడు 12వ రోజు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు✍ యూపీ: నేడు వారణాసిలో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన… నేడు సుపరిపాలన అంశంపై సెమీనార్‌లో పాల్గొననున్న ప్రధాని మోదీ✍ ఈరోజు సాయంత్రం తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం✍ తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు కౌంటింగ్.. ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం✍ తిరుపతి: నేటితో ముగియనున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర… ఈరోజు సాయంత్రం…
ఏపీలో స్కిల్ స్కాం కేసులో గంటా సుబ్బారావును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుపై గంటా సుబ్బారావు తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. గంటా సుబ్బారావు ఒక సాక్షి మాత్రమే అని, సాక్షిగా రమ్మని సమన్లు పంపి ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సీమెన్స్ అగ్రిమెంట్ సమయంలో సుబ్బారావు లేరని, రాజ్యాంగ విరద్దుంగా సాక్షిని నిందితుడిగా చూపించారని అన్నారు. కుల ప్రాతిపదికన గంటా సుబ్బారావు ముందున్న అధికారిని పక్కన…
పీఆర్సీ పై ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని.. ముఖ్యమంత్రి జగన్ తమ డిమాండ్లు పరిష్కారం చేస్తారనే నమ్మకం ఉందని వెల్లడించారు ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు. ప్రభుత్వం నుంచి మా డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేకపోవడం నిరసన కార్యాచరణ ప్రారంభించామని.. సీఎస్ నేతృత్వంలో పీఆర్సీ పై నివేదిక వెల్లడించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమస్య ముఖ్యమంత్రి స్థాయిలో పరిష్కారం కావాల్సిందేనని.. 1-07-2018 నుంచి ఫిట్ మెంట్ ఇవ్వాల్సి ఉండగా… నివేదికలో ఈ ఏడాది…