ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు పెరుగుతూ.. తాగుతూ వస్తున్నాయి. అయితే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 35,071 శాంపిల్స్ పరీక్షించగా.. 163 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఒక్క కోవిడ్ బాధితుడు మృతిచెందారు.. ఇదే సమయంలో 162 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,08,62,705 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్…
గుంటూరు జిల్లా వైసీపీలో సెల్ఫ్‌గోల్…! స్ట్రాటజీ లోపించిందో ఏమో.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టేశారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు. స్వపక్షంలో విపక్షంగా మారి చర్చల్లోకి వచ్చారు. మంత్రి, ఎమ్మెల్యేలు మీటింగ్‌కు వచ్చినా.. కలెక్టర్, JCలు రాకపోవడం అనుమానాలకు కారణమై.. కొత్త చర్చకు దారితీసింది. ఎందుకిలా? వాళ్ల పరువు వాళ్లే తీసేసుకుంటున్నారా? గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలుంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది 15. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో మద్దాలి గిరి.. వైసీపీకి జై కొట్టేశారు. దాంతో అధికారపార్టీ…
చంద్రబాబుకు వచ్చింది కోపమేనా..? టీడీపీని చక్కదిద్దుకునేందుకు చికిత్స మొదలుపెట్టిన ఆయనకు.. వాస్తవాలు తెలుస్తున్నకొద్దీ కోపం నషాళానికి ఎక్కుతోందా? కొందరు కోవర్టులుగా మారారనే అనుమానం రోజు రోజుకూ బలపడుతోందా? చేతలు కాలక ఆకులు పట్టుకున్న బాబు.. ఆగ్రహాన్ని కంటిన్యూ చేస్తారా..? మధ్యలోనే మెత్తబడతారా..? పార్టీ చీఫ్‌కు వచ్చిన కోపంపై తమ్ముళ్లలో చర్చ..! టీడీపీలో కోవర్టులున్నారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. మండలం.. నియోజకవర్గం.. జిల్లా స్థాయిల్లో కాదని.. ఏకంగా రాష్ట్రస్థాయిలోనే కోవర్టులు ఉన్నారని.. వారిని ఏరిపారేస్తానని కుప్పం సమీక్షలో చెప్పారు…
పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్… పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిపోయిన ఘటనలో ఇప్పటికే ఐదుగురు మహిళలు సహా 9 మంది మృతిచెందారు.. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు పోలీసులు.. అయితే, ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్…
గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం…
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగులో అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా పడింది. అశ్వారావుపేట పేట నుండి జంగారెడ్డిగూడెం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మరో 10 కిలో మీటర్లు వెళ్తే బస్సు జంగారెడ్డిగూడెం చేరుకుంటుంది అనే సమయంలో డీవైడర్ ను ఢీ కొట్టి జల్లేరు వాగులో బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఏడు మృతి మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదం…
తూర్పు గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. జిల్లాలో మూడు ఒమిక్రాన్ అనుమానిత కేసులు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. బంగ్లాదేశ్ వెళ్లొచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సింగపూర్ నుంచి వచ్చిన దంపతులకు ఒమిక్రాన్‌గా అనుమిస్తున్నారు.. అయినవల్లి (మం) సిరిపల్లిలో యువకుడిని, రావులపాలెం (మం) గోపాలపురంలో భార్య,భర్తలను ఐసొలేషన్‌లో ఉంచారు అధికారులు.. ఇప్పటి వరకూ ఎవరికీ ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ కాలేదు.. ముగ్గురు శ్యాంపిల్స్ హైదరాబాద్ పంపించాం.. ఫలితాలు హైదరాబాద్ జీనోమ్ ల్యాబ్ నుంచి మూడు…
గత టీడీపీ హయాంలో రూ. 8 కోట్ల 20 లక్షలతో ముడసర్లోవ వద్ద ట్రాన్సీట్ హాల్ట్ ఏర్పాటు చేశాం. ఆధునిక యంత్రాలతో చెత్త నుంచి కంపోస్టు తయారీ, మిగిలిన చెత్తను కాపులప్పాడ యార్డుకు తరలించాలని దీనిని ఏర్పాటు చేసారు అని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. కానీ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తగిన నిధులు ఇవ్వకుండా దీన్ని డంపింగ్ యార్డుగా తయారు చేసింది. ఆ డంపింగ్ యార్డు వల్ల పక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్ జలాలు,…
ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు.. 500 మంది రైతులకు దర్శన సౌకర్యం కల్పించనుంది టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు… కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. కాగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహా పాదయాత్ర ప్రారంభించిన…
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం… పిడుగురాళ్ల, మచిలీపట్నం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు కాబోతున్నాయి… ఈ విషయంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్.. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో మూడు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు వెల్లడించారు.. Read Also: చెడ్డీ గ్యాంగ్…