ఏపీలో సినిమా టిక్కెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. రేపు ‘పుష్ప’ సినిమా విడుదల నేపథ్యంలో టిక్కెట్ల రేట్ల విషయంలో గందరగోళం నెలకొంది. గతంలో ఉన్న కమిటీలో లోటు పాట్లను సరిచేసి కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. టిక్కెట్ల ధరల జాబితాను జాయింట్ కలెక్టర్‌కు పంపించాలని థియేటర్ యజమానులకు కూడా హైకోర్టు సూచించింది. టిక్కెట్ల ధరలకు అనుగుణంగా పన్నులు చెల్లించాలని కూడా హితవు పలికింది.…
టీడీపీ మాజీ మంత్రి, కర్నూలు జిల్లా నాయకురాలు భూమా అఖిలప్రియ గురువారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు భూమా అఖిలప్రియ తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. భూమా అఖిల ప్రియ తన తల్లి శోభానాగిరెడ్డి జయంతి రోజునే మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. Read Also: ఏపీ పాలనా రాజధానిపై మంత్రి కీలక వ్యాఖ్యలు తల్లి శోభానాగిరెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన…
ఉద్యోగులకు 34 శాతం ఫిట్మెంట్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కరోనా, ఆర్థిక సంక్షోభం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని.. ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్ ఇస్తున్నామన్నారు. ఉద్యోగుల గ్రాస్ వేతనం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సజ్జల. సీఎస్ కమిటీ సిఫార్సు చేసిన 14.29 ఐఆర్ ను అమలు చేస్తూ ఐఆర్ కు రక్షణ ఉండేలా చూస్తామని… రేపటికి పీఆర్సీ పై…
అధికారం మనదే.. అడిగేవారే లేరు.. అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? నిఘావర్గాల నివేదికలతో ఆ ఎమ్మెల్యేల జాతకాలు మారబోతున్నాయా? అన్నీ చూస్తున్న హైకమాండ్… వారిని వదిలించుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? జగన్ గాలిలో అనామకులు సైతం ఎమ్మెల్యేలుగా గెలుపు..! 2014లో ఓడిన వైసీపీ 2019లో 151 సీట్లతో ఘన విజయం సాధించింది. టీడీపీకి కంచుకోటలు వంటి నియోజకవర్గాల్లో సైతం వైసీపీ విజయబావుటా ఎగుర వేసింది. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఇతర…
సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోంది అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 15 ఏళ్ళ నుంచి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్ఎస్బిసి మూతపడటం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర…
పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ టీడీపీని కలవర పెడుతున్నాయా? ఈ మధ్య కాలంలో టీడీపీని జనసేనాని ఎక్కడా విమర్శించకపోయినా.. ఆందోళన ఎందుకు? పవన్ చూపిస్తున్న సింపతీపై తమ్ముళ్ల లెక్కలేంటి? లెట్స్ వాచ్..! టీడీపీని జనసేనాని తిట్టకపోయినా.. తమ్ముళ్లలో టెన్షన్..! కొంతకాలంగా జనసేనాని పవన్‌కల్యాణ్ సీఎం జగన్ మీద.. YCP ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికారపార్టీ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. అలాగే పవన్ ఏపీకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి రాజకీయం కాస్తో కూస్తో వేడెక్కుతూనే ఉంది.…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి కోడిగుడ్ల నాణ్యతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే కోడిగుడ్లల్లో నాణ్యత లేదని లేఖలో పేర్కొన్నా సోము వీర్రాజు.. కుళ్లిపోయిన కోడిగుడ్లను ఇవ్వడం వల్ల పిల్లలకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. పౌష్టికాహార లోపాన్ని నివారించేలా కేంద్రం తగినంతగా నిధులిస్తున్నా..…
నరసరావుపేట పార్లమెంట్‌పై ఈ మధ్య ఓ నేతకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. పార్టీలు పక్కనపెట్టి ప్రజాసేవ చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యేలను, స్థానికులు కలుపుకొని హల్చల్ చేస్తున్నారు. ఉంటే ఢిల్లీలో.. లేదంటే నరసరావుపేటలో.. ఇదే నా టార్గెట్..! నేను మీ వాడినే అంటూ ఊరూరు తిరుగుతున్నారట. ఇంతకీ ఢిల్లీ నుంచి నరసరావుపేటపై ప్రేమ కురిపిస్తున్న నేత ఎవరు? జీవీఎల్ ముందస్తుగా ఇల్లు సర్దుకుంటున్నారా? GVL నరసింహారావు. ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా బీజేపీకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం…
పీఆర్సీ పై పీటముడి వీడడం లేదు.. పీఆర్సీ, ఇతర 70 డిమాండ్లపై ఉద్యోగ సంఘాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుల సజ్జల నిన్న జరిపిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి.. అయితే.. ఇవాళ అంటే.. వరుసగా మూడో రోజూ కూడా చర్చలు కొనసాగనున్నాయి.. ఉద్యోగ సంఘాలతో మరో దఫా చర్చించనున్నారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ప్రభుత్వ సలహాదారు సజ్జల.. ఫిట్మెంట్, మానిటరీ బెనిఫిట్స్ అమలు తేదీ తేలటమే కీలకంగా మారినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిశ్వభూషణ్ హరిచందన్ తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం ముగిసింది. గవర్నర్ దంపతుల ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి దంపతులు అడిగి తెలుసుకున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యలో బాధపడుతున్న గవర్నర్‌ను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. కొన్ని రోజుల క్రితం బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా బారిన పడ్డారు. హైదారాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నారు. అయితే, పోస్ట్ కరోనా తరువాత మళ్లీ ఇబ్బందులు తలెత్తడంతో తిరిగి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో కొన్నిరోజులు ట్రీట్మెంట్ తీసుకొని కోలుకున్నాక ఏపీ వచ్చారు.…