రేషన్ షాపులో సంక్రాంతి మామూళ్లు.. డబ్బా పెట్టి మరీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సంక్రాంతి పండగ ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఓవైపు సర్కార్, పోలీసులు నిఘా పెడుతున్నా కోడి పందాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.. పని చేస్తున్న ప్రాంతాన్ని వదిలి.. సొంత ఊరికి పరుగులు పెడుతున్నారు.. దీని కోసం ప్రత్యేక రైళ్లు, ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఇక, సంక్రాంతి పండుగ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా పండగకు అవసరమైన సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉంటుంది సర్కార్.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా రేషన్ వాహనాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే కాగా.. ప్రభుత్వ రేషన్ వాహనాల్లో సంక్రాంతి పండగ మామూళ్లు వసూళ్లు చేయడం చర్చగా మారింది.
Read Also: కోవిడ్ ఎఫెక్ట్… ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
Also Read
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్ల గ్రామంలో ప్రభుత్వ రేషన్ వాహనంలో వసూళ్ల పర్వానికి తెరలేపారు.. దీని కోసం ప్రత్యేకంగా రేషన్ పంపిణీ వాహనంలో డబ్బా పెట్టి మరీ మామూళ్లకు పాల్పడుతున్నారు.. రూ.250 నుంచి 400 వరకు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.. పండగకు మామూళ్లు ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని బెదిరింపులకు దిగుతున్నారని చెబుతున్నారు.. మామూళ్లు ఇవ్వకపోతే పథకాలు ఆపేస్తామని.. కార్డులు రద్దు చేస్తామని హెచ్చరించినట్టు కూడా తెలుస్తోంది. అయితే, స్థానికంగా జనసేన పార్టీకి చెందిన ఓ నేత ఆ దృశ్యాలను ఫొటోలో, వీడియోలు తీసి వైరల్ చేశారు.. సోషల్ మీడియాతో ఆ వీడియోలు ఇప్పుడు రచ్చ చేస్తున్నరాయి.. బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాకృష్ణ నియోజకవర్గం పరిధిలో ఈ ఘటన వెలుగు చూడడం కూడా చర్చగా మారింది.. ఈ వ్యవహారం మంత్రిగారి దృష్టికి రావడంతో స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. దీంతో ఎండీయూ శివను తొలగిస్తామంటున్నారు తహసీల్దారు. మొత్తంగా.. రేషన్ వాహనంలో మామూళ్ల వ్యవహరం పెద్ద రచ్చగా మారింది.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..