Parthiban: తెలుగు నాయుడ్ని అన్న పార్థిబన్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విలక్షణ నటుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక నటుడిగా ఆయన ప్రతిభను అందరూ గౌరవిస్తారు, కానీ ఆయన ప్రదర్శిస్తున్న Double Standards మాత్రం విమర్శలకు దారితీస్తున్నాయి. తమిళనాడులో పా. రంజిత్ నేతృత్వంలో జరిగే వేదికలపై పార్తిబన్ తరచుగా కుల రహిత సమాజం గురించి, సమానత్వం గురించి మాట్లాడుతుంటారు. అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తిగా అక్కడ తనని తాను ఆవిష్కరించుకుంటారు. కానీ, అదే వ్యక్తి తెలుగు నేల మీదకు రాగానే తన అసలు గుర్తింపు తన కులం అని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read:Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. “నేను తెలుగువాడిని, నాయుడు కులానికి చెందినవాడిని. ఇది నా అసలు సిసలైన గుర్తింపు. కానీ నేను పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. ప్రస్తుతం నాకు తెలుగు అంతగా రాదు, కానీ తదుపరి సక్సెస్ మీట్ నాటికి తెలుగు నేర్చుకుని మిమ్మల్ని అలరిస్తాను” అని పేర్కొన్నారు.తమిళనాడులో ప్రగతిశీల మాటలు చెబుతూ, వేరే రాష్ట్రానికి రాగానే కుల కార్డును బయటకు తీయడం కేవలం ఇక్కడి ఆడియన్స్‌ను ప్రసన్నం చేసుకోవడానికేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ నటుల వెనుక ఉన్న కులాన్ని చూడలేదు. రజనీకాంత్ నుంచి నేటి తరం నటుల వరకు ప్రతిభను చూసి మాత్రమే నెత్తిన పెట్టుకున్నారు. అటువంటి గడ్డపై ఎదిగి, ఇక్కడ కులాన్ని ప్రస్తావించడం ఆ సంస్కృతిని అవమానించడమే అవుతుంది. ఒక గొప్ప నటుడికి ఉండాల్సిన గుర్తింపు ఆయన కళ, కానీ పార్తిబన్ తన కులమే తన ప్రాథమిక గుర్తింపు అని చెప్పడం ఆయనలోని ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఈ అంశంపై తమిళ నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ, “మేము మిమ్మల్ని ఒక కళాకారుడిగా గౌరవించాము తప్ప మీ కులం చూసి కాదు” అని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు