Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్‌స్పెక్టర్
- మూడబిద్రి ఇన్‌స్పెక్టర్‌పై సంచలన ఆరోపణలు
- బ్లాక్‌మెయిల్, లైంగిక వేధింపుల ఆరోపణలు
- మైనర్ బాలికపై కన్నేసినట్లు ఆరోపణలు
- విచారణకు ఆదేశాలు, పోలీస్ శాఖ స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Se*xual Harassment : శాంతిభద్రతలను కాపాడాల్సిన ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, తన వద్దకు న్యాయం కోసం వచ్చిన మహిళలనే లైంగికంగా వేధిస్తున్నాడనే వార్త ఇప్పుడు కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. మంగళూరు కమిషనరేట్ పరిధిలోని మూడబిద్రి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సందేష్ పి.జి.పై ఒక మహిళ చేసిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పోలీస్ శాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
వివరాల ప్రకారం.. ఒక కుటుంబ కలహాల విషయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఇన్‌స్పెక్టర్ సందేష్ టార్గెట్ చేశాడు. ఆమె భర్తను కేసులో ఇరికించి, అతన్ని విడుదల చేయాలంటే తనకు రూ. 25 లక్షల డబ్బు ఇవ్వాలని లేదా తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన పోస్టింగ్ కోసం హోం మంత్రికి రూ. 50 లక్షలు ఇచ్చి వచ్చానని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ఆయన గర్వంగా చెప్పుకున్నట్లు బాధితురాలు ఆరోపించారు.
ఈ కేసులో అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే, సదరు మహిళను లైంగికంగా వాడుకోవడమే కాకుండా, ఆమె మైనర్ కుమార్తెపై కూడా ఇన్‌స్పెక్టర్ కన్ను వేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఆ మైనర్ బాలిక చదువుతున్న కాలేజీకి వస్తానని బాధితురాలిని ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గత కొద్ది నెలలుగా ఈ అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నా, వారు ఆయనను కాపాడుతున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ అంశం వివాదాస్పదం కావడంతో మంగళూరు పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఏసీపీ శ్రీకాంత్ ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించనున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని కమిషనర్ కోరారు. మరోవైపు, బాధితురాలు ఇప్పటికే ముఖ్యమంత్రికి, హోం మంత్రికి , మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!