రాజంపేట లోక్సభ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది.. ఏపీలో సంచలనంగా మారిన మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. అయితే, మిథున్రెడ్డి పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ చీఫ్ వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ పర్యటనలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అబ్బద్ధాలను ప్రచారం చేయడంలో ఆరి తేరిందన్నారు.. వాళ్ల భాష, పరామర్శలు రాష్ట్ర ప్రజలు అంతా చూస్తున్నారన్న ఆయన.. వేలాది మందితో వెళ్లి చేసేది పరామర్శా? లేక దండ యాత్రో.. వాళ్లే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు..
JC Prabhakar Reddy: రప్పా రప్పా, రాత్రిపూట కన్ను ఎగిరేస్తే ఎలా ఉంటుందో నీకు (బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి) తెలుస్తుంది అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీలాంటి భాష మేము మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు.. నీకంటే బండ బూతులు మాట్లాడడం నాకు వస్తుంది.
Vijayawada: విజయవాడలో పబ్ల పేరుతో యువత రాత్రిళ్లు నానా రచ్చ చేస్తుండటంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రముఖ పబ్లో అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత కూడా పార్టీలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.
Marriage Fraud: బెజవాడలో నిత్య పెళ్లి కూతురు అను ఆగడాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో పబ్స్ వేదికగా అక్కడకు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని అను ఈ పెళ్లిళ్ల మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
Minister Narayana: రైతులకు కేంద్రం ఇచ్చే 6 వేలతో కలిపి మొత్తం 20 వేలు ఇస్తామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం పథకం ద్వారా 10 వేల కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాలో జమ చేశామని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
Telangana AP water row on Banakacherla Project: ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది. బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు ససేమిరా అంటూ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. బనకచర్లపై జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీ అభ్యంతరాలు తెలిపాయని పేర్కొంది. ఇప్పటి వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ సర్కార్ లేఖలో ప్రస్తావించింది. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢిల్లీలో…
East Godavari Tragedy: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని మనస్థాపనతో కొవ్వూరులో ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది.
Bobbili Tragedy: విజయనగరం జిల్లా బొబ్బిలిలో స్కూల్ విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న కొట్లాట ఒక విద్యార్థి ప్రాణం తీసింది. సుందరాడ కార్తీక్ అనే విద్యార్థి మృతికి అభ్యుదయ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహించాలని అంబేద్కర్ పోరాట సమితి డిమాండ్ చేస్తోంది.