* నేడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన.. కాంగ్రెస్ ఎంపీలకు కులగణనపై రేవంత్ ప్రెజెంటెషన్.. పలువురు ఎంపీలు, కేంద్రమంత్రులను రేవంత్ కలిసే అవకాశం..
* నేడు మహబూబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పర్యటించనున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క.. రేషన్ కార్డుల పంపిణీతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి సీతక్క..
* నేడు సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూములపై విచారణ..
* నేడు తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో సంబరాలు.. ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు దాటిన సందర్భంగా.. 96 డిపోలు, 341 బస్ స్టేషన్లలో వేడుకలు.. ఉదయం 10 గంటలకు ఎంజీబీఎస్ లో జరిగే సంబరాల్లో పాల్గొననున్న మంత్రి పొన్నం ప్రభాకర్..
* నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్-ఏపీ సదస్సు.. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా.. పారిశ్రమిక వేత్తలతో సీఎం చంద్రబాబు సమ్మిట్.. యూఏఈ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సదస్సు..
* నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ కు రానున్న పవన్.. ఆంధ్రా వర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఈవెంట్ కి చిత్ర బృందం..
* నేడు హరిహర వీరమల్లు ప్రీమియర్ షో.. తెలంగాణలో సినిమా టిక్కెట్ ధరల పెంపు.. ప్రీమియర్ షో టిక్కెట్ ధర రూ. 600గా నిర్ణయం..
* నేడు తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. ఉండ్రాజవరం మండలం చివటంలో సుపరిపాలన-తొలి అడుగు కార్యక్రమం.. పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి, స్కిల్ డెవలప్మెంట్ ఛైర్మన్ శేషరావులు..
* నేడు కాకినాడలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి..
* నేడు చెవిరెడ్డి పిటిషన్ పై ఏసీబీ కోర్టులో విచారణ.. జైలులో సొంతంగా వంట చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి పిటిషన్..
* నేడు విశాఖలోని ఆంధ్ర వర్సిటీ ముందు విద్యార్థుల ఆందోళన.. మెస్ ఆహారంలో పురుగులు వస్తున్నాయని స్టూడెంట్స్ నిరసన.. రాత్రి నుంచి నేలపైనే పడుకొని నిరసన తెలుపుతున్న విద్యార్థులు..
* నేడు ఈఏపీ సెట్ సీట్ల కేటాయింపు.. ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ సీట్లు కేటాయింపుపై.. జాబితాను విడుదల చేయనున్న అధికారులు..
* నేడు విశాఖలో గరుడ అయోధ్య రామమందిరం సెట్ కు సాధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు.. దేవుడి పేరుతో వ్యాపారం చేయడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం.. నిర్వహాకులపై ఇప్పటికే పోలీసుల కేసు నమోదు..
* నేడు తిరుమల ఆన్ లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణం దర్శనం టిక్కెట్లు.. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శనం టికెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధుల, వికలాంగుల దర్శనం టిక్కెట్లు.. ఇక, రేపు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.
* నేడు శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఆరుద్రోత్సవం, మాసశివరాత్రి సందర్భంగా శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన.. ఆరుద్రోత్సవం సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి స్వర్ణరధోత్సవం.. ఆలయ పురవీధులలో స్వర్ణరథంపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్న శ్రీస్వామి అమ్మవారు..
* నేడు మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు.. తొలి రెండు రోజులు సభలో విపక్షాల తీవ్ర నిరసన.. పహల్గామ్, ఆపరేషన్ సిందూర్ పై చర్చకు విపక్షాల పట్టు.. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్..
* నేటి నుంచి 2 దేశాల్లో పర్యటించనున్న మోడీ.. యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని.. యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగే ఛాన్స్.. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మోడీ..