Thaman: ‘కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి’.. కొత్త వివాదానికి తెరలేపిన తమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఎప్పుడూ సరదాగా ఉంటూనే, అప్పుడప్పుడు సెన్సేషనల్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్ మేళం’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్‌ను విష్ చేస్తూనే, స్టేజ్ మీద ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సైన్స్ సబ్జెక్టులను వాడుతూ ఆయన వేసిన పంచ్‌లు సినిమా ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారితీశాయి.
Also Read : Band Melam : ‘బ్యాండ్ మేళం’ టీజర్ ఈవెంట్‌లో శివాజీ కామెంట్స్ వైరల్..!
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ఈవెంట్‌లో హీరో హర్ష్ రోషన్, హీరోయిన్ శ్రీదేవిల గురించి తమన్ మాట్లాడుతూ.. “మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి” అని సరదాగా అంటూనే, తర్వాతి మాటతో అందరినీ ఆశ్చర్యపరిచారు. “ఏమనుకోకండ్రా.. నేను 5th క్లాస్ ఫెయిల్.. నాకు జువాలజీ (Zoology) రాదు” అంటూ నవ్వులు పూయించారు. సాధారణంగా హీరో హీరోయిన్ల మధ్య ‘కెమిస్ట్రీ’ బాగుందని అనడం కామన్, కానీ తమన్ దానికి ఫిజిక్స్, జువాలజీలను జోడించి వెటకారంగా అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దీనిని కొందరు కేవలం ఫన్ కోసమే అన్నారని భావిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కొత్త వివాదానికి (Controversy) దారి తీసేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయన ‘5th ఫెయిల్’ అని తనను తాను తక్కువ చేసుకుంటూనే, ఎదుటివారికి చురకలు అంటించడం తమన్ మార్క్ స్టైల్ అని ఫ్యాన్స్ అంటున్నారు. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివాజీ కూడా పాల్గొనగా, తమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆ మూవీ ప్రమోషన్లకు కావాల్సినంత బజ్‌ను తెచ్చిపెట్టాయి. మొత్తానికి తమన్ మాటలు సరదాగా అన్నారా లేక ఇందులో ఏదైనా అంతరార్థం ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.
తాజావార్తలు
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!