PM Modi: నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
- నేటి నుంచి 2 రోజులు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన
- కీలక ఒప్పందాలు చేసుకునే ఛాన్స్
- ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని మోడీ ఈరోజు ఇజ్రాయెల్ పర్యటనకు బయల్దేరి వెళ్తున్నారు. నేటి నుంచి రెండు రోజులు ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ పార్లమెంట్‌ను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీకి అరుదైన గౌరవంగా చెప్పొచ్చు. 2015లో రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ ఇజ్రాయెల్‌లో పర్యటించి పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం మోడీకి దక్కింది. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను కూడా మోడీ కలవనున్నారు.
ఇది కూడా చదవండి: Pakistan vs England: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. సెమీఫైనల్‌కు చేరాలంటే పాక్ ముందున్న దారులు ఇవే..!
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్‌పింగ్‌కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలపడే విధంగా ఒప్పందాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్, వాణిజ్య మంత్రి పియూస్ గోయల్ కూడా ఇటీవలే ఇజ్రాయెల్‌లో పర్యటించి వచ్చారు. అలాగే ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం కూడా ఇటీవల ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కూడా పాల్గొంది. తాజా పర్యటనతో మరింత బలపడనున్నాయి.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ వ్యక్తిగత స్నేహితుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ శక్తిగా అభివర్ణించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. ‘రాడికల్’ విరోధులను ఎదుర్కోవడానికి కొత్త కూటమిని (షడ్భుజ) ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్ పర్యటన కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆదివారం ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘‘ఇజ్రాయెల్‌తో విశ్వాసం, ఆవిష్కరణ, శాంతి, పురోగతి పట్ల ఉమ్మడి నిబద్ధతపై నిర్మించబడిన శాశ్వత స్నేహాన్ని భారతదేశం ఎంతో విలువైనదిగా భావిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
నెతన్యాహు కూటమిలో భారతదేశం, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్‌లను కీలక భాగస్వాములుగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కూడా కూటమిలో చేరవచ్చు అని పేర్కొంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ఇంకోవైపు పాకిస్థాన్-సౌదీ అరేబియా నాటో లాంటి కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో టర్కీ కూడా చేరింది. ఈ నేపథ్యంలో కొత్త కూటమి ఏర్పాటు కోసం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!