Minister Vasamsetti Subhash: మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులు ఓ దళిత యువకుడిపై దాడి చేశారంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్పందించారు మంత్రి సుభాష్.. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మొన్న అమలాపురం ఘటనలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొంతమంది డబ్బులు తీసుకున్నారు.. ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు దాడి చేశారని తెలిపారు.. అయితే, దాడి చేసినవారు. నా అనుచరులు అని వైసీపీ బ్యాచ్.. నా పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. అవసరం లేని విషయాలు ట్రోల్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. గత ప్రభుత్వంలో దాచుకున్న జగన్ మద్యం తాగి మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, నా అనుచరులు దాడి చేశారు అంటున్నారు.. అనుచరులు అంటే నా తో తిరిగారా..? నా కారు ఎప్పుడైనా ఎక్కారా..? అని ప్రశ్నించారు మంత్రి వాసంశెట్టి సుభాష్..
Read Also: Al Qaeda Module Busted: అల్ ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్..
ఇక, సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం స్పష్టంగా ఉందన్నారు మంత్రి సుభాష్.. అర్హులు అందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న ఆయన.. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అని ప్రకటించారు.. సంక్షేమంతో పాటు అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టామని వెల్లడించారు.. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ఐటీలో పెట్టుబడులు వస్తున్నాయి.. యువతకు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని వెల్లడించారు మంత్రి వాసంశెట్టి సుభాష్..