Varanasi : మహేశ్ – రాజమౌళి ఫైట్.. రేయ్ దారుణం రా ఇది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ఏఐ టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని వారుండరు. ఉంటే మాత్రం.. నిజంగానే మహేష్ బాబు, రాజమౌళి కొట్టుకున్నారా? ఇద్దరి మధ్య ఇంత పెద్ద ఫైట్ జరిగిందా? అని అనిపించకమానదు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏఐ వీడియోలు మితిమీరిపోతున్న సంగతి తెలిసిందే. ఏది ఒరిజినలో? ఏది ఏఐ క్రియేటేడో? తెలియకుండా పోతోంది. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మరియు దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకరితో ఒకరు తలపడుతున్నట్లు రూపొందించిన ఒక ఏఐ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోలు విలన్లతో పోరాడటం చూస్తుంటాం. కానీ, ఈ ఏఐ వీడియోలో స్వయంగా రాజమౌళి, మహేశ్ బాబు యాక్షన్ సీక్వెన్స్‌లో తలపడటం నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ వీడియోను చూసిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “సినిమా ఈజ్ డెడ్” అంటూ వీడియోను షేర్ చేశారు. భవిష్యత్తులో నటులు, భారీ సెట్లు, కెమెరాల అవసరం లేకుండానే కేవలం కంప్యూటర్ ముందు కూర్చుని ఏఐతో అద్భుతమైన సినిమాలు తీసేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ సినిమా మేకింగ్‌కు ఇది ముగింపు పలుకుతుందనే అర్థంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో ‘వారణాసి’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్‌లో రాబోతున్న ఈ సినిమా పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లోకి రానుంది. కానీ ఈలోపు.. ఇలాంటి ఏఐ దారుణాలు ఇంకెన్ని చూడాలో ఏమో!
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
- WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
- Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!