HHVM : పవన్ కల్యాణ్ నుంచి చాలా ఏళ్ల తర్వాత హరిహర వీరమల్లు సినిమా వస్తోంది. భారీ పాన్ ఇండియా మూవీగా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొన్నటి వరకు ఏ సినిమాకు లేనంతగా ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీగా రేట్లు కూడా పెంచేశాయి. ఇక ప్రీమియర్స్ షోలకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ చూస్తే పవన్ రేంజ్ ఏంటో అర్థమైపోతోంది. ఇప్పుడున్న హవా చూస్తుంటే ప్రీమియర్స్ తోనే భారీ రికార్డులు కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నారు వీరమల్లు. బుధవారం రాత్రి 9.30 గంటల నుంచే ఏపీలో ప్రీమియర్స్ షోలు పడుతున్నాయి. ఏపీలో ప్రీమియర్స్ టికెట్ రేట్లు రూ.1000 దాటిపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే రూ.1500లకు ఒక టికెట్ అమ్ముతున్నా సరే కొంటున్నారు ఫ్యాన్స్.
Read Also : HHVM : నా సినిమాను ఎవరూ బాయ్ కాట్ చేయలేరు.. పవన్ ఫైర్..
ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ప్రీమియర్ షోల ద్వారానే తన సత్తా చూపిస్తున్నాడు వీరమ్లలు. ఇక్కడ 49 సెంటర్లకు గాను 47 సెంటర్లలో 107 ప్రీమియర్ షోలు వేస్తున్నారు. అంటే వీరమల్లు సత్తా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏ సినిమాకు ఈ స్థాయిలో ప్రీమియర్స్ వేయలేదని బయ్యర్లు చెబుతున్నారు. ఇక్కడ టికెట్ రేట్లు రూ.800ల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయినా సరే ప్రీమియర్ షోలన్నింటికీ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తూ.గో జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి, ఉత్తరాంధ్రలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో అయితే ఇప్పటి వరకు 116 షోలు వేస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు, గుంటూరు, కృష్ణా, రాయలసీమ జిల్లాల్లో కూడా భారీగా ప్రీమియర్స్ షోలు వేస్తున్నారు.
ఒక్కో జిల్లాకు ఎంత లేదన్నా రూ.50లక్షల నుంచి కోటి రూపాయల దాకా ప్రీమియర్స్ నుంచే వచ్చేలా కనిపిస్తోంది. ఇటు నైజాం ఏరియాలో హైదరాబాద్ లోనే భారీగా ప్రీమియర్స్ వేస్తున్నారు. దీంతో ఇక్కడ ఎంత లేదన్నా రూ.6 కోట్ల దాకా వచ్చేలా కనిపిస్తోంది. అటు ఏపీ నుంచి రూ.12 కోట్ల దాకా కేవలం ప్రీమియర్స్ నుంచే వచ్చేలా ఉందంటున్నారు. ఏపీలో రూ.60 కోట్లకు అమ్మారు. తొలి రోజే రూ.12 కోట్లకు పైగా వసూలు చేయడం అంటే మాటలు కాదు. ఈ లెక్కన ప్రీమియర్స్ తోనే రికార్డుల వేట మొదలు పెడుతున్నాడు వీరమల్లు.
Read Also : Anasuya : తన సినీ ఎంట్రీ మిస్టరీ రివిల్ చేసిన అనసూయ..