Band Melam : ‘బ్యాండ్ మేళం’ టీజర్ ఈవెంట్‌లో శివాజీ కామెంట్స్ వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘కోర్ట్’. ఆ చిత్రంతో పాపులర్ అయిన హర్ష్ రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “బ్యాండ్ మేళం” (Band Melam). మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కోన వెంకట్ రూపొందించిన ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్ నటుడు శివాజీ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా..
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో శివాజీ మాట్లాడుతూ.. ‘బ్యాండ్ మేళం’ చిత్రం ఒక స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కిందని ప్రశంసించారు. ఈ సినిమాలో తాను ఒక కీలక పాత్ర చేయాల్సి ఉందని,కానీ అది రొటీన్ అవుతుందనే ఉద్దేశంతో సున్నితంగా తిరస్కరించానని ఆయన వెల్లడించారు. నటీనటుల గురించి ప్రస్తావిస్తూ.. శ్రీదేవి అద్భుతమైన నటి అని, రోషన్ చాలా టాలెంట్ ఉన్న నటుడని, భవిష్యత్తులో అతను గొప్ప స్థాయికి వెళ్తాడని శివాజీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కోర్ట్’ సినిమాను గత ఏడాది మార్చి 13న ప్రీమియర్ వేసి ఘనవిజయం అందుకున్నామని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ కూడా అదే సెంటిమెంట్‌తో మార్చి 13న విడుదల కాబోతోందని, ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
Also Read
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్‌గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
- AP Weather Update: ఈదురు గాలులతో వర్షాలు.. ఈ జిల్లాల్లో కీలక హెచ్చరికలు జారీ..
తాజావార్తలు
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!