CPI Ramakrishna: సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీ, వైసీపీ పార్టీలపై హాట్ కామెంట్స్ చేశారు. ఆదాని పవర్స్ తో 17 వందల కోట్ల రూపాయల లంచం తీసుకుని వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, టీడీపీ అధికారంలోకి వచ్చాక యూజర్ చార్జీల పేరుతో మరో రూ. 15 వందల కోట్లు ప్రజలపై భారం వేసింది అని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు ఎవరడిగారని బిగిస్తున్నారు? అని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మత ప్రాతిపదికన మార్చాలని చూస్తున్నారు.. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం.. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పుకునే టీడీపీ ఏం సాధించింది అని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు.
Read Also: HHVM : నా సినిమాను ఎవరూ బాయ్ కాట్ చేయలేరు.. పవన్ ఫైర్..
ఇక, వైసీపీ ప్రభుత్వం కంటే ప్రస్తుతం డబుల్ అప్పులు టీడీపీ చేస్తుంది అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం 31 వేల కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం అప్పు చేసింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో లక్ష 75 వేల కోట్ల రూపాయల అప్పులు చేసింది అన్నారు.