MP Mithun Reddy: లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట..
- లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట..
- జైలులో అవసరమైన సదుపాయలు కల్పించాలని ఆదేశాలు..
- వారంలో 3 రోజులు కుటుంబ సభ్యులు, మరో మూడు రోజులు లాయర్లకు అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మిథున్ రెడ్డి రాజమండ్రి జైలులో అవసరమైన కొన్ని సదుపాయాలు కల్పించాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, వారంలో మూడు సార్లు కుటుంబ సభ్యులతో.. మరో 3 సార్లు లాయర్లతో ములాఖాత్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది.
Read Also:
HHVM : వీరమల్లు అందుకే లేట్ అయింది.. పవన్ క్లారిటీ..
Also Read
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
ఇక, ఎంపీ మిథున్ రెడ్డికి ఇంటి భోజనం రోజుకు ఒకసారి తీసుకు రావచ్చునని విజయవాడలోని ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, మిథున్ రెడ్డికి వెస్ట్రన్ కమోడ్ తో కూడిన ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడంతో పాటు ఒక అటెండర్, తనకు అవసరమైన మందులు, టెలివిజన్, పెన్ను, పేపర్ లాంటి సౌకర్యాలను కల్పించాలని కూడా న్యాయస్థానం ఆదేశాల్లో వెల్లడించింది. అయితే, ఈ ఉత్తర్వులు మిథున్ రెడ్డి తరఫున కోర్టును ఆశ్రయించిన పిటిషన్‌కి సంబంధించినవి కావడం గమనార్హం.
మరోవైపు, ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డితో వైసీపీ నేతలు ములాఖాత్ అయ్యారు. మిథున్ రెడ్డి రిమాండ్ కి వచ్చిన తరువాత మాజీమంత్రి చెల్లబోయిన వేణు గోపాలకృష్ణ, గోపాలపురం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మొదటి ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. ఎంపీ మిథున్ రెడ్డిని జైలులో ఒక ప్రజాప్రతినిధిగా పరిగణించే పరిస్థితి కనపడటం లేదన్నారు. ఒక సాధారణ ఖైదీలాగానే ట్రీట్ చేస్తున్నారని, కల్పించాల్సిన సదుపాయాలు కల్పించలేదని మండిపడ్డారు. మిథున్ రెడ్డి సర్వైకల్ పెయిన్ తో ఇబ్బంది పడుతున్నారు.. అతడికి జైలు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. టీవీ, న్యూస్ పేపర్, సదుపాయం కల్పించలేదన్నారు. వై కేటగిరి భద్రతలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధిని ఈ రకంగా ట్రీట్ చేయడం సరికాదని ఆరోపించారు.
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!