తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. అయితే, ఈ వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది..
40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కొవ్వూరు - భద్రాచలం రైల్వే ప్రాజెక్ట్ మరోసారి తెరపైకి వచ్చింది. రైల్వే సమస్యలపై సికింద్రాబాద్ లోని రైల్వే జీఎం శ్రీవాస్తవతో రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి భేటీ అయిన సందర్భంగా ఈ ప్రాజెక్టుపై ఆరా తీశారు. సర్వే జరిగినప్పటికీ పనులు పూర్తవ్వలేదన్న విషయాన్ని ఎంపీ ప్రస్తావించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు.. కాసేపటికే క్రితమే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు సమావేశం ముగిసింది.. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.. మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రి అమిత్ షాకు, కేంద్రానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై అమిత్ షాతో చర్చించారు.
నేను చాలా అదృష్టవంతుడిని.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో కలిసి పనిచేసే అవకాశం లభించింది అని గుర్తుచేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. పీఎం మ్యూజియంలో జరిగే "ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు" అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఆ క్రమంలో 6వ సంస్మరణ ప్రసంగం చేశారు.. పీవీ భారత ముద్ద బిడ్డ, భారత రత్న.. అసలుసిసలు తెలుగు బిడ్డ అని కీర్తించారు.. ఆయనతో నాకు మంచి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లుగా ఇతర శాఖల ఉద్యోగుల నియామకంపై విధివిధానాలు జారీ చేసింది... ఇతర శాఖల నుంచి ఎక్కువ మంది మున్సిపల్ శాఖకు వచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో పలు నిబంధనలతో ఉత్తర్వులు జారీ చేసింది..
ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కార్.. అఖిల భారత సర్వీసుల అధికారులకు నేషనల్ పెన్షన్ పథకం (NPS)కింద ఇచ్చే వాటా పెంచింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఏఐఎస్ అధికారులకు ప్రభుత్వం ఇచ్చే వాటాను 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
రామాయపట్నం పోర్టుపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టిసారించింది.. పరిశీలనకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.. ఆర్థిక, ఐ అండ్ ఐ, టూరిజం శాఖల మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది..
హైదరాబాద్లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.. అయితే, దీనిపై జనసేన పార్టీ స్పందించింది.. భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ సమగ్రత, భాషా సామరస్యంపై జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలోచన విధానమపి స్పష్టం చేసింది.