పవన్ ఏదో చేస్తారని పిఠాపురం ప్రజలు ఆశపడ్డారు.. కానీ, ఏడాది గడిచినా పిఠాపురంలో అభివృద్ధి సున్నా అని ఎద్దేవా చేశారు. పవన్ సీఎం అవుతానని చెప్పి.. మరొకరిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు. ఇక, రాజకీయంగా జన్మనిచ్చిన పిఠాపురంలో పవన్ అంతం అయ్యేలా వచ్చే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని జక్కంపూడి రాజా కోరారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంది.
Botsa Satyanarayana: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Vallabhaneni Vamsi: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవడంతో, ఆయనను కుటుంబ సభ్యులు అత్యవసరంగా విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.. ఎక్కడ.. ఎలా.. ఏ ప్లాన్‌తో డబ్బులు కొట్టేస్తారో కూడా తెలియని పరిస్థితి.. ఇప్పుడు, చిత్తూరు జిల్లాలో వెలుగు చూసిన ఓ భారీ మోసం చూస్తే.. అతడి కన్నింగ్ ఐడియా చూసి అంతా నోరువెల్లబెడుతున్నారు.. పెళ్లి పేరుతో ఏకంగా 28 కోట్ల రూపాయలు కొట్టేశాడో కేటుగాడు.
వైఎస్ జగన్ పర్యటన పేరుతో సైకోలతో కలిసి వ్యర్థం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇక, ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగా పసిగట్టి.. వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు మంత్రి వాసంశెట్టి సుభాష్
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గత నెల 30వ తేదీన విజయవాడలో జరిగిన 'అమరావతి క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్ నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు తీసుకోవాలని తెలిపింది ప్రభుత్వం.
ఒక్కసారి మా పాఠశాలకు రండి చూడాలని ఉంది అంటూ ఓ పాఠశాల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కి ఉత్తరాలు రాశారు.. తమ స్కూల్లో కల్పించిన సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేసిన ఆ విద్యార్థులు.. సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రికి ధన్యవాదులు తెలుపుతూ..