Bhumana Karunakara Reddy: మద్యం కుంభకోణం పేరుతో అక్రమ అరెస్టులకు కూటమీ ప్రభుత్వం పాల్పడుతొందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మీదా ఏ సెక్షన్ లు అయితే పెట్టారో వాటినే వైసిపి నేతలపై పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మద్యం స్కాం ఎక్కడ బయట పడుతుందనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం సూమారు 4 వేల మద్యం షాపులను టీడీపీ, జనసేన పార్టీ నేతలకు ఇచ్చారు.. నెలకు రూ. 3 వేల కోట్లను కూటమి ప్రభుత్వ బిగ్ బాస్ లకు మూడుపులు చేరుతున్నాయి.. 14 శాతం కమీషన్ పెంచి షాపుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సేకరించి మూడుపులు రూపంలో ప్రభుత్వ బిగ్ బాస్ కు చేరుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి బాటిల్ కు 10 నుంచి 20 రూపాయల వరకు అధికంగా అమ్ముకుంటూ డబ్బుల దాచుకుంటున్నారు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Kingdom : కింగ్ డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడే.. ఎక్కడంటే..?
అయితే, ఏ మద్యం తాగినా ఆరోగ్యానికి హానికరమే.. ప్రభుత్వం అమ్ముతున్న రూ. 99లకే చీప్ లిక్కర్ బాటిల్ తో తీవ్రమైన అనారోగ్యాలు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే భూమన అన్నారు. రాష్ట్రంలో మద్యం ఎరులా పారుతున్న ప్రభుత్వానికి మాత్రం ఆదాయం రాలేదు.. ఆ ఆదాయన్ని బిగ్ బాస్ జేబులో వేసుకుంటున్నారు.. వైసీపీ ప్రభుత్వం హయంలో మద్యం పాలసీతో ప్రజలకు ఎంతో మేలు జరిగింది.. వైసీపీ హయంలో ఏ ఒక్క తాగుబోతు ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు.. కూటమి ప్రభుత్వంలో ఏకంగా తిరుమలలోనే మద్యం తాగుతున్నారుని ఆరోపించారు. వైసీపీ హయంలో మద్యంలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదు అని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.