Telugu CMs Meeting: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
Harish Rao Meets KCR: హైదరాబాద్ లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు కీలకంగా సమావేశమయ్యారు.
గోదావరి జలాలను ఒక్క బొట్టు కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. కేంద్రం ప్రభుత్వంతో చర్చిస్తాం.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడమన్నారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ ని అసలు ఒప్పుకునేదే లేదని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ కట్టి.. నీళ్లు ఎక్కడికి తీసుకుపోయారో చూసాము.. పక్కనే ఉన్న గోదావరి నీళ్లను ఇక్కడి ప్రజలకి అందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మరణం మరవక ముందే అలనాటి నటి సరోజ మరణం అందరికీ షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 90 సంవత్సరాలు. నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. Also Read:Kingdom : అన్నదమ్ములుగా విజయ్, సత్యదేవ్.. సాంగ్ ప్రోమో…
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ బుధవారం సమావేశం కానున్నారు. ఈ మేరకు జలశక్తిశాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలు, సీఎస్‌లకు సమాచారం పంపించింది. ఢిల్లీలోని జలశక్తిశాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తిభవన్లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ సమావేశం జరుగనుంది.
సత్యవేడు పేరు వింటేనే... టీడీపీలో షేకవుతోందట. ఈ నియోజకవర్గంలోని వ్యవహారాలను చూసి... జిల్లా నేతలతో పాటు... పార్టీ పెద్దలు సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన కోనేటి ఆదిమూలంకు పార్టీ టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇష్టం లేకపోయినా.... అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ నేతలంతా కలిసి ఆయన్ని గెలిపించుకున్నారు.
కైకలూరుకు చెందిన నాయకుడు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ వ్యవహారాన్ని అనుమానాస్పదంగా చూస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయ వర్గాలు. ఆయన మనసులో ఏముంది? అడుగులు ఎటువైపు పడుతున్నాయని గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నట్టుండి సైలెంట్ అవడం వెనక ప్రత్యేక కారణాలు ఉన్నాయా అంటూ ఆరాలు తీస్తున్నారు. గతంలో టీడీపీలో ఉన్న వెంకటరమణ వైసీపీలో చేరాక ఆ పార్టీ ఎమెల్సీ పదవి ఇచ్చింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు బొమ్మరిల్లు సినిమా గుర్తుకు వస్తోందట. ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి డాడీ.. అన్న డైలాగ్‌ని తెగ గుర్తు చేసుకుంటూ సేమ్ సీన్ అని యువ ఎమ్మెల్యేలు ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక్కడ డాడీ కేరక్టర్లో మంత్రి అచ్చెన్నాయుడు ఉంటే... కొత్త ఎన్నికైన ఐదుగురు ఎమ్మెల్యేలు అదే డైలాగ్ చెబుతున్నారట.
హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి. దాంతో 3 వేల 850 క్యూసెక్కులకు కాలువ సామర్ధ్యం పెరిగింది. వంద రోజుల్లో లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది.