ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది.. లిక్కర్ కేసు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి కౌంటర్లు, సుపరిపాలన – తొలి అడుగుపై చర్చించింది మంత్రివర్గం.. మొత్తంగా 42 అజెండా అంశాలపై కేబినెట్‌లో చర్చ సాగింది.. ఎల్ఆర్ఎస్‌కు ఆమోదం తెలిపింది కేబినెట్.. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు సంబంధించి చర్చించి ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. నాలా చట్ట సవరణకు సంబంధించి చర్చించి.. ఆమోదం తెలిపారు.. ఇక, పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.. రెండు కొత్త పాలసీలకు సంబంధించి కేబినెట్‌లో చర్చించి.. ఆ తర్వాత ఆమోదముద్ర వేశారు.. మరోవైపు, మంత్రుల పనితీరుపై కేబినెట్‌లో చర్చించారు.. గ్రీన్ హైడ్రోజెన్ డిక్లరేషన్‌కు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.. నవంబర్‌లో 8 క్వి.. బిట్ క్వాంటం కంప్యూటర్ ఆవిష్కరించనున్నట్టు కేబినెట్‌లో తెలియజేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. దేశంలోనే తొలిసారి అమరావతిలో ఇది ఆవిష్కరిస్తున్నట్టు వెల్లడించారు.. ఇక, వ్యవసాయం, నీటి నిర్వహణ, ఆరోగ్య రంగాల్లో.. విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.. అందుకు నేషనల్ క్వాంటం మిషన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
అయోధ్య రామమందిరం సెట్ వేశారు.. ఉచ్చులో చిక్కుకున్నారు..!
విశాఖ లోని అయోధ్య రామ మందిరం నమూనా సెట్ నిర్వాహకులకు ఉచ్చు బిగుస్తుంది.. ఆధ్యాత్మిక ముసుగులో కమర్షియల్ గా నిర్వహిస్తున్న రామ మందిరం వివాదం ముదురుతుంది.. అయోధ్య రామ మందిరం నిర్వాహకులపై రెండు ఫిర్యాదులు అందుకున్నారు విశాఖ త్రీ టౌన్ పోలీసులు.. ముగ్గురు నిర్వహకులుపై 318(4) r/w 3(5) BNS కింద త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇప్పటికే.. త్రీ టౌన్ పోలీసులకి భద్రాచలం ఈవో రమాదేవి ఫిర్యాదు చేయగా.. అనంతరం విశాఖ నుంచి మరొక ఫిర్యాదు అందింది.. త్రీ టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు విశాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ టి. అన్నపూర్ణ.. ఇక, అన్నపూర్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఎఫ్.ఐ.ఆర్ లో కళ్యాణం పోస్టర్ పై ముగ్గురు నిర్వాహకులకు చెందిన మూడు సెల్ ఫోన్ నంబర్లను పొందుపరిచారు… సీతారాముల కళ్యాణం జరుపుటకు రూ.2999కి టికెట్స్ విక్రయించినుట్టు.. అందులో ప్రకటన చేశారని.. ఫిర్యాదులో పేర్కొన్నారు.. నిర్వాహకులు వంగలపూడి దుర్గా ప్రసాద్, రాజా, గరుడ ప్రసాద్ లపై కేసు నమోదు చేయగా.. మరో వైపు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడానికి సిద్ధమవుతున్నరు దుర్గా ప్రసాద్ బాధితులు… మొత్తంగా.. అయోధ్య రామ మందిరం నమూనా సెట్ వేసి కష్టాల్లో చిక్కుకున్నారు నిర్వాహకులు..
సింగపూర్ టూర్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో తన సింగపూర్ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేబినెట్ సమావేశంలో సింగపూర్ టూర్‌పై స్పందించిన సీఎం.. గత ప్రభుత్వం హయాంలో సింగపూర్‌పై దుష్ప్రచారం చేశారు.. సింగపూర్ మంత్రులపై తప్పుడు ఆరోపణలు చేశారు.. అయితే, మళ్లీ సింగపూర్ తో సంబంధాలు పునరుద్ధరణ కోసం ఈ టూర్ ఉపయోగపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం అవుతుందని వెల్లడించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కాగా, నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికార హోదాలో తొలిసారి సింగపూర్ కు పర్యటనకు సిద్ధం అయ్యారు చంద్రబాబు.. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతోపాటు రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో ఆవిష్కరించాలనే ఆయన అభిమతానికి అనుగుణంగా ఈ పర్యటన కొనసాగుతుందంటున్నారు.. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 27న వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో సమావేశం కాబోతున్నారు ఏపీ సీఎం.. విదేశీ పెట్టుబడులు, అమరావతి నిర్మాణం గురించి ప్రవాసీయులకు వివరించనున్నారు. సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు నారాయణ, లోకేష్, టీజీ భరత్ ఈ సమావేశంలో పాల్గొనున్నారు.
బీసీసీఐ బిగ్ అప్‌డేట్.. బ్యాటింగ్ కు అందుబాటులోనే రిషబ్ పంత్.. వికెట్ కీపర్ గా ఆ ప్లేయర్
ఇంగ్లండ్- భారత్ మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 4వ టెస్ట్ మ్యాచ్ జూలై 23న ప్రారంభమైంది. కాగా మాంచెస్టర్ టెస్టు మొదటి రోజు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. పంత్ పాదం చివరి వేలికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో గాయపడ్డ పంత్‌కు ఆరు వారాలు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. అయితే గాయం కారణంగా నాలుగో టెస్ట్ సహా.. ఐదవ టెస్టుకు సైతం అతడు దూరమవుతాడా అన్న సందేహాలపై బీసీసీఐ బిగ్ అప్ డేట్ ఇచ్చింది. కాలు గాయం అయినప్పటికీ, ఇంగ్లాండ్‌తో జరిగే మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపింది. దీనిపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) జూలై 24న (గురువారం) అప్‌డేట్ ఇచ్చింది. రెండవ రోజు ఆటకు రిషబ్ పంత్ జట్టులో చేరాడని, అవసరం మేరకు మాత్రమే బ్యాటింగ్ చేస్తాడని BCCI తెలిపింది. అయితే, ఈ మ్యాచ్‌లో రిషబ్ ఇకపై వికెట్ కీపింగ్ చేయడని BCCI స్పష్టం చేసింది. వికెట్ కీపింగ్ బాధ్యత ధ్రువ్ జురెల్ భుజాలపై ఉంటుంది.
కామపల్లి సైబర్ మోసగాడు పోలీసుల వలలో – 4 లక్షల రూపాయల దోపిడీ
ఓ సైబర్ నేరగాని పోలీసులు వెంటాడి వెంటాడి నేరాల పుట్టను రట్టు చేసిన సంఘటన కామపల్లిలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి కి చెందిన గడబోయిన హరీష్ గత కొంతకాలంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడు. ఫేక్ ఐడీలను సృష్టించి అనేక మంది వద్ద డబ్బులను తన ఎకౌంట్లో జమ చేసుకోవడం ప్రధాన ఉత్తిగా మారింది. హరీష్ ఇంటి వద్ద ఉంటూ టెంట్ హౌస్ తో పాటు మినరల్ వాటర్ ప్లాంట్ ను నడిపిస్తూ మరోవైపు అతి తొందరలో కోటీశ్వరుని కావాలనే ఆలోచనతో ఈ సైబర్ నేరాల దందాకు పాల్పడుతున్నాడు. గూగుల్లో టెంపరరీ మెయిల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఇంస్టాగ్రామ్ లో బ్రేక్ ఐడీలతో డిఫరెంట్ వ్యక్తులను పరిచయం చేసుకొని వారి నుండి డబ్బులు వేర్వేరు అకౌంట్లో జమ చేసుకుంటున్నాడు. ప్రొఫైల్ పిక్ సోషల్ మీడియా ద్వారా అందమైన అమ్మాయిలతో చాటింగ్ చేసి తన వద్ద పనిచేసే మధు అనే వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు జమ చేశాడు..216 ఫేక్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేశాడు.
భారత్-యూకేల మధ్య కుదిరిన అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’’
భారత్, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)ల మధ్య అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA)’’ కుదిరింది. గురువారం మైలురాయిగా నిలిచే ఈ ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్రమోడీ, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ సమక్షంలో ఇరు దేశాల వాణిజ్య మంత్రులు పియూష్ గోయల్, జొనాథన్ రేనాల్డ్స్ సంతకాలు చేశారు. 2020లో యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి యూకే నిష్క్రమించిన తర్వాత, ఆ దేశం చేసిన అతిపెద్ద ఒప్పందం ఇదే. లండన్‌లో మోడీ, స్టార్మర్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ఒప్పందం అనంతరం ప్రధాని మోడీ, స్టార్మర్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) భారత్, యూకేల ఉమ్మడి శ్రేయస్సుకు బ్లూ ఫ్రింట్ అని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు మన సంబంధాలలో ఒక చారిత్రాత్మక రోజు. అనేక సంవత్సరాల కృషి తర్వాత, నేడు మన రెండు దేశాలు సమగ్ర ఆర్థిక మరియు వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడం నాకు సంతోషంగా ఉంది’’ అని ప్రధాని మోడీ అన్నారు.
వాట్సాప్ మరో క్రేజీ ఫీచర్.. మీరు మర్చిపోయినా గుర్తు చేస్తది!
ఇన్ స్టంట్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ను దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నవారందరు ఉపయోగిస్తున్నారు. వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది. ప్రైవసీ, వాట్సాప్ సేవలను మరింత సులువుగా అందించేందుకు మెటా ప్లాట్ ఫామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఈ క్రమంలో మరో క్రేజీ ఫీచర్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. అదే రిమైండ్ మీ ఫీచర్. ఆ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటికే చదివిన చాట్ కోసం మెసేజ్ లో రిమైండర్ ను సెట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ తాజా వెర్షన్‌లో, వినియోగదారులు వ్యక్తిగత సందేశాల గురించి వాట్సాప్ ఎప్పుడు గుర్తు చేయాలో ఎంచుకోవచ్చు. iOS, ఆండ్రాయిడ్‌లో చదవని మెసేజ్ లకు రిప్లై ఇవ్వడానికి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే రిమైండర్‌లను చూపిస్తుంది. కానీ ఇప్పుడు ‘రిమైండ్ మీ’ ఫీచర్ మీ పనిని మరింత సులభతరం చేస్తుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్ బీటా తాజా వెర్షన్ 2.25.21.14 లో కనిపించింది. ఇది మెసేజింగ్ యాప్‌లో మీకు మెసేజ్ రిమైండర్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, యూజర్ మెసేజ్ హైలైట్ అయిన వెంటనే మెసేజ్‌ని నొక్కి ఉంచి, స్క్రీన్ కుడివైపు కార్నర్ లో ఉన్న మూడు-చుక్కల మెనుపై క్లిక్ చేసి, కొత్త ఫీచర్‌ని టెస్ట్ చేయడానికి ‘రిమైండ్ మీ’ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
ఇంగ్లాండ్- భారత జట్ల మధ్య వన్డే, టీ20 సిరీస్‌లు.. షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
భారత జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అక్కడ ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. టెస్ట్ సిరీస్ ఉత్కంఠ మధ్య, క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అందించింది బీసీసీఐ. టీమిండియా మరోసారి ఇంగ్లాండ్ లో పర్యటించనున్నది. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB), భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వచ్చే ఏడాది భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు T20, మూడు ODI మ్యాచ్‌లు ఆడనున్నట్లు ప్రకటించాయి. ODI, T20 సిరీస్‌లు రెండూ జూలై 2026లో ఇంగ్లాండ్‌లో జరుగనున్నాయి. ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్ జూలై 1న ప్రారంభంకానుండగా, వన్డే సిరీస్ జూలై 14న ప్రారంభమవుతుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ జూలై 1న డర్హామ్‌లో ప్రారంభంకానుంది. ఆ తర్వాత మిగిలిన టీ20 మ్యాచ్‌లు జూలై 4, జూలై 7, జూలై 9, జూలై 11 తేదీల్లో జరుగుతాయి. దీని తర్వాత మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఉంటుంది. వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూలై 14న జరుగుతుంది. మిగిలిన రెండు వన్డే మ్యాచ్‌లు జూలై 16, జూలై 19 తేదీల్లో జరుగుతాయి.
చిత్రపురి కాలనీపై సందేహాలున్న వారంతా మీటింగుకు రండి !
చిత్రపురి కాలనీ అధ్యక్షుడిగా ఉన్న వల్లభనేని అనిల్ కుమార్ గురించి టాలీవుడ్ వర్గాల వారికి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఆయన మీద ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన రేపు ఒక మీటింగ్ నిర్వహించబోతున్నారు. మీడియా, పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు, సినీ పరిశ్రమ సంఘాలు అలాగే చిత్రపురి కాలనీలో జరుగుతున్న ఆరోపణలపై సందేహాలున్న సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్‌లో ఆయన వారందరికీ సమాధానాలు ఇస్తానని వెల్లడించారు. చిత్రపురి కాలనీపై పదేపదే ఆరోపణలు చేస్తున్న వారికి, పోరాటాలు, ధర్నాలు చేస్తున్న వారికి, అందరి సందేహాలు నివృత్తి చేయడానికి చిత్రపురి కమిటీ మేము ఎందుకు రాబోతోంది.
ఏపీలో కింగ్‌డమ్ టికెట్ రేట్లు హైక్.. ఎంతంటే?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ సినిమా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సితార నాగవంశీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో లెక్కల ప్రకారం ఈ సినిమాకి సంబంధించి సింగిల్ స్క్రీన్‌లో జీఎస్టీతో కలిపి 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి 75 రూపాయలు పెంచి అమ్ముకునేలా అవకాశం కల్పించారు.
హరిహర తెలుగు స్టేట్స్ ‘ప్రీమియర్స్ షో’ కలెక్షన్స్.. ఆల్ టైమ్ రికార్డ్..
హరిహర వీరమల్లు మొత్తానికి భారీ అంచనాల మధ్య, భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అలాగే ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ వేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఏపీలో భారిగా ప్రీమియర్స్ వేసారు. అయితే నైజాంలో పర్మిషన్ వచ్చిన కూడా డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్స్ కు మధ్య వచ్చిన ఇస్యూస్ కారణం కేవలం ప్రీమియర్స్ కు 5 గంటల ముందు మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఓవరాల్ గా కాస్త ఆలస్యంగా ప్రీమియర్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినా కూడా అదరగొట్టింది హరిహర వీరమల్లు. ముఖ్యంగా నైజాంలో రూ. 5.08కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో రూ. 1,53,72,690 (షేర్ )తో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. వెస్ట్ గోదావరి లో రూ. 1.42 కోట్లు, కృష్ణ జిల్లా రూ. 81 లక్షల ( షేర్ ) రాబట్టింది. ఉత్తరాంధ్ర రూ. 2.32 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కు గాను అటు ఇటుగా రూ. 18 కోట్లు. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2 కోట్లు వసూలు చేసింది. ఏపీలోని కొన్ని ఏరియాలు నిర్మాత ఏ ఎం రత్నం సొంతంగా రిలీజ్ చేసారు. అసలు బజ్ లేని సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే పవర్ స్టార్ స్టార్ డమ్ అనే చెప్పాలి. ఇక ఈ రోజు ఉదయం ఆటలు తెలుగు స్టేట్స్ లో హౌస్ ఫుల్స్ తో నడుస్తున్నాయి. ప్రీమియర్ + డే 1 కలిపి అటు ఇటుగా రూ. 50 కోట్ల షేర్ దాటే అవకాశం ఉంది.