Amaravati Farmers: రాజధాని ప్రాంతం అమరావతి రైతులకు తీపికబురు చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రైతులకు సంబంధించిన 11వ ఏడాది కౌలు సొమ్మును విడుదల చేసింది సర్కార్.. 163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసింది.. 18,726 మంది రైతులకు కౌలు జమైనట్లు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) వెల్లడించింది.. అయితే, 88 మంది రైతులకు సాంకేతిక కారణాలతో వారి ఖాతాల్లో సొమ్ము జమ కాలేదని.. కౌలు జమకాని రైతులు.. మరోసారి బ్యాంకు వివరాలు అందజేయాలన్న అధికారులు సూచించారు..
Read Also: Bengaluru: బెంగళూర్ బస్టాండ్‌లో పేలుడు పదార్థాలు..జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ స్వాధీనం..
కాగా, గత ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి.. కొన్ని చోట్ల.. పగలు, రాత్రి షిఫ్ట్‌ల్లోనూ పనులు జరుగుతుండగా.. మరికొన్ని చోట్ల.. పగలు మాత్రమే పనులు నిర్వహిస్తున్నాయి.. ఆయా పనులు దక్కించుకున్న సంస్థలు.. ఓవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి మా అజెండా అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది..