Chittoor Police: రేపు చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జిల్లాలోకి వచ్చే వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖను చూస్తున్నారు ఆ మహిళామంత్రి. ఉత్తరాంధ్రకు చెందిన సదరు మినిస్టర్ చుట్టూ.. ఇప్పుడు వివాదాలు ఓ రేంజ్లో ముసురుకుంటున్నాయట. ఆ మంత్రి పేషీలో జరుగుతున్న వ్యవహారాలు చూసి ప్రభుత్వ పెద్దలకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
వైసీపీలో వర్గ పోరుకు కేరాఫ్ చింతలపూడి నియోజకవర్గం అన్న పేరుంది. ఇక్కడ పనిచేసే వారికంటే...ఇతరులే పైచేయి కోసం ప్రయత్నిస్తారని, అదే అసలు సమస్య అని చెప్పుకుంటారు.
Madanapalle Files Burning Case: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో మదనపల్లె మాజీ ఆర్డీవో మురళిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు.
TTD AEO Suspended: తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈవో రాజశేఖర్ బాబుపై సస్పెన్షన్ వేటు పడింది. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా రాజశేఖర్ బాబు వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.
Minister Anam: నెల్లూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు.
CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ. సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Minister Payyavula: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలు, ఖజానాపై మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగా ప్రేమ చూపిస్తున్నారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
AP Cabinet: రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతిలో 20, 494 ఎకరాల భూ సమీకరణకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
Minister Savitha: భారతదేశ మహిళలను ఇతర దేశాలలో కూడా గౌరవిస్తారు అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత సవిత తెలిపారు. కానీ, మహిళా రైతులు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లినప్పుడు ఎలా అసభ్యకరంగా మాట్లాడారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.