Independence Day: భారత స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ ప్రభుత్వం వచ్చినప్పట్నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ వస్తుంది ప్రభుత్వం.. విభజన తర్వాత ఏర్పడిన తొలి ప్రభుత్వంలో చంద్రబాబు సర్కార్‌తో పాటు.. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగానే వేడుకలు నిర్వహించగా.. ఈ సారి అమరావతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది కూటమి సర్కార్.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అమరావతి ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సర్కార్.. వేగంగా నిర్మాణ పనులు కొనసాగిస్తోంది.. మరోవైపు, భూ సమీకరణపై కూడా దృష్టిసారించింది.. ఈ సారి అమరావతితో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనుండగా.. ఇక,పై ప్రతీ ఏడాది అమరావతి కేంద్రంగానే ఈ వేడుకలు నిర్వహించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలా కనిపిస్తోంది..
Read Also: HHVM : గురువు సత్యానంద్ కు పాదాభివందనం చేసిన పవన్..