ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మహిళలపై జరుగుతోన్న అఘాయిత్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడ..? మాటలు తప్ప చేతలు లేని చేతగాని ప్రభుత్వమిది.. వరుసగా మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం లేదు అంటూ ఫైర్ అయ్యారు మనోహర్.. పోలీసులను రాజకీయ అవసరాలకు వాడుకుంటూ శాంతి భద్రతలను గాలికొదిలేశారని ఆరోపించిన ఆయన.. దిశ చట్టం చేశాం.. గన్ కంటే జగన్ ముందు వస్తాడు.. లాంటి మాటలు…
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆరుగురు ఐఏఎస్‌లకు ఊరట లభించింది… ఐఏఎస్ అధికారులకు ఈమధ్యే విధించిన సేవా శిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు… కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకుగాను కోర్టు ధిక్కరణ కేసులో ఎనిమిది మంది ఐఏఎస్‌లకు సేవా శిక్షను హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన విషయం విదితమే కాగా.. ఈ శిక్షను డివిజనల్ బెంచ్‌లో గత వారం సవాల్ చేశారు.. అందులోని ఇద్దరు ఐఏఎస్ అధికారులు… దీంతో, సేవాశిక్షను ఎనిమిది వారాల పాటు సస్పెండ్ చేసింది…
2024 ఎన్నికలకు సిద్ధం అవుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసిన పార్టీ అధినేత వైఎస్ జగన్.. రాష్ట్రంలోని 175 స్థానాల్లో 175 ఎందుకు గెలవకూడదు అని ప్రశ్నించారు.. దీనిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సెటైర్లు వేస్తోంది… సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి… రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ పార్టీకి 175 స్థానాలు ఎలా వస్తాయి..? అని…
అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో 1.23 లక్షల ఇళ్లపట్టాల పంపిణీని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30.70 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. మరోవైపు 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభమైందని వెల్లడించారు. గజం 12 వేలికే చోట రూ.6 లక్షలు విలువైన ఇళ్లస్థలాన్ని పేదలకు ఇచ్చామని తెలిపారు. ఇంటి నిర్మాణం, మౌలిక సదుపాయాలతో కలిపి రూ.10 లక్షల వరకు…
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జడ్పీ హైస్కూల్లో టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. లీక్ సూత్రధారి రాజేష్ సహా 11 మంది టీచర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాల గురించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. ఎగ్జామినేషన్ డ్యూటీకి హాజరై మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన ప్రధాన వ్యక్తి టి.రాజేష్ అని తెలిపారు. పేపర్ లీకేజీ సమాచారం వచ్చిన వెంటనే తహసీల్దార్ ఆధ్వర్యంలో డీఈవో, పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్లు…
ఏపీ సీఎం జగన్ అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్నారు. సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం లే అవుట్లో నిర్మించిన మోడల్ హౌస్‌ను సీఎం జగన్ పరిశీలించారు. వైఎస్ఆర్ పార్కులో దివంగత నేత ఎస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్ఐపై మట్టి మాఫియా ఎదురు కేసు పెట్టడంపై లేఖలో వర్ల రామయ్య అభ్యంతరం తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు పెట్టారంటే మట్టి మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం…
ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రేపు రాత్రికి ఢిల్లీలోనే జగన్ ఉండనున్నారు. ఈనెల 30న శనివారం జరగనున్న జ్యుడిషీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో…
★ నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. సబ్బవరం మండలం పైడివాడలో 1.23 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్న జగన్.. పార్క్ పైలాన్‌ను ప్రారంభించనున్న జగన్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న జగన్ ★ విజయవాడ: ఈరోజు సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం.. అరగంట పాటు గవర్నర్‌తో భేటీ కానున్న జగన్ ★ చిత్తూరు: నేడు పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి…
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్.. పార్టీ శ్రేణులను బిజీ చేయడమే కాదు.. తాను బిజీగా గడుపుతున్నారు.. అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు.. ఇక, గురువారం రోజు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగనుంది.. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి… సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో ఆయన చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. Read Also: KCR: టీఆర్ఎస్ సుసంపన్న పార్టీ.. ఒక్క పిలుపిస్తే రూ.600 కోట్లు..! రేపు ఉదయం…