తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో కాకపుట్టిస్తున్నాయి.. వైసీపీ నేతలు కేటీఆర్‌ను టార్గెట్ చేస్తే.. టీడీపీ నేతలు మాత్రం నిజమే అంటున్నారు.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులు కేటీఆర్ చెప్పారన్నారు.. అయితే, ఏపీ విధ్వంసం, తెలంగాణ అభివృద్ధి వైఎస్ జగన్ -కేసీఆర్‌ల ఉమ్మడి అజెండాగా ఆరోపించారు. ఒకప్పుడు ఏపీలో ఉన్న భూముల ధరలు 200 శాతం పడిపోతే, తెలంగాణలో గణనీయంగా…
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, కరెంట్ లాంటి సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి.. దీంతో, కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ మంత్రలు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన.. చాలా సున్నితమైన అంశం, కేటీఆర్ చెప్పినట్టు అయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా? అని ప్రశ్నించారు. ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు.. నేను హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా.. అక్కడ కరెంటే లేదు, నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని…
హైదరాబాద్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో పక్క రాష్ట్రం అంటూ సంబోధిస్తూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఏపీలో తమ ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్‌కు జోగి రమేష్ సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్…
ఏపీలో పదో తరగతి పరీక్షల సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. తొలిరోజు తెలుగు, రెండో రోజు హిందీ పరీక్షల పేపర్లు లీక్ అయినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మూడో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మూడో రోజు నంద్యాల జిల్లా నందికొట్కూరులో టెన్త్ పేపర్ లీక్ అయ్యిందని వార్తలు హల్చల్ చేశాయి. గాంధీ మెమోరియల్ హైస్కూల్ నుంచి ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. స్కూల్ అటెండర్ ద్వారా పేపర్…
పక్కరాష్ట్రంలో రోడ్లు, విద్యుత్, నీళ్లు లేవని మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్లకు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ లాగే కేటీఆర్ పిట్టకథలు చెబుతున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి మాట్లాడే హక్కు టీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. నీళ్లు, కరెంట్, రోడ్లు ఉన్నాయో లేదో విజయవాడకు వచ్చి చూస్తే అర్ధమవుతుందన్నారు. కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. అలా అభివృద్ధి ప్రాంతంగా మారిన హైదరాబాద్…
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలపై సెటైర్లు వేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో పక్క రాష్ట్రానికి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం…
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు.…
చంద్రబాబు, లోకేష్‌కు చీర పంపిస్తామని మంత్రి రోజా చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. రోజా తనకు చీర పంపిస్తా అంటున్నారని.. ఒకవేళ ఆమె తనకు చీర పంపిస్తే తాను తీసుకుని గౌరవప్రదంగా తన తల్లికి ఇస్తానని లోకేష్ తెలిపారు. అయితే చీర కట్టుకునే మహిళలను అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి రోజా మహిళా సమాజానికి ఆమె క్షమాపణలు చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.…
దేశంలో 12 రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో పాటు ఇళ్లకు గంటల తరబడి కోతలు విధిస్తున్నారు. వేసవి కారణంగా ఏపీలో డిమాండ్ పెరిగిపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ కొరత నెలకొంది. దీంతో విద్యుత్ వినియోగంపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించాయి. ఇప్పటికే పరిశ్రమలపై విద్యుత్ సంస్థలు ఆంక్షలు విధించగా..…