విశాఖలో దారుణం వెలుగు చూసింది. ఉక్కు ఉద్యోగుల జనరల్ ఆసుపత్రిలో ఓ వైద్యుడు నీచంగా ప్రవర్తించాడు. తన వంకరబుద్ధిని బయటపెట్టాడు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై చీఫ్ డాక్టర్ కపాడియా అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో సదరు బాలిక ఆస్పత్రి బయటకు వచ్చి 100 నంబర్‌కు కాల్ చేసింది. తనపై వెకిలి చేష్టలకు పాల్పడ్డ డాక్టర్‌పై తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మరోవైపు…
చిత్తూరు జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే కాసేపటికే పేపర్ లీక్ అంశం స్థానికంగా కలకలం రేపింది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు -1 పేపర్ వాట్సాప్‌లో రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఈ అంశంపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. సోషల్ మీడియాలో బయటకు వచ్చిన పేపర్ చిత్తూరు జిల్లాకు సంబంధించింది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వివరించారు. అయితే పలమనేరులో పదో తరగతి…
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు, ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చీరలు కట్టుకోవాలని రోజా వ్యాఖ్యానించారు. టీడీపీ మహిళా ద్రోహుల పార్టీ అని.. అందరికంటే పెద్ద ఉన్మాది చంద్రబాబే అన్నారు. టీడీపీలో ఉన్నంతమంది ఉన్మాదులు దేశంలోనే లేరని రోజా ఆరోపించారు. మహిళ అని చూడకుండా మహిళా ఛైర్‌పర్సన్‌పై చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. రిషితేశ్వరిని పొట్టనపెట్టుకుంది టీడీపీ నేతలు కాదా అని మంత్రి…
ఏపీ సీఎం జగన్ బుధవారం బిజీ బిజీగా గడపనున్నారు. కరోనా పరిస్థితులపై మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు పార్టీ నేతలు, మంత్రులతో ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ వన్ టౌన్లో షా జహూర్ ముసాఫిర్ ఖానా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశం అవుతారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో…
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. 3,20,063 మంది బాలురు, 3,02,474 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్లోకి అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అయితే సహేతుక కారణాలతో లేటుగా వస్తే అనుమతించాలని నిర్ణయించారు. పదో…
★ ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. మే 9వ వరకు జరగనున్న పరీక్షలు.. హాజరుకానున్న 6,22,537 మంది విద్యార్థులు.. 3,776 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు ★ అమరావతి: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో సీఎం జగన్ కీలక భేటీ.. 2024 ఎన్నికలే అజెండాగా…
ఏపీలో వైసీపీ కీలక నేతలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ పార్టీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి రీజనల్, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. గతంలోనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎమ్మెల్యేలు,…
టీడీపీ అధినేత చంద్రబాబుపై హోంమంత్రి తానేటి వనిత విమర్శలు చేశారు. టీడీపీకి మహిళలపై గౌరవం లేదన్నారు. అత్యాచార బాధితురాలి పరామర్శను చంద్రబాబు రాజకీయం చేశారని ఆరోపించారు. ఈ ఘటన జరిగిన మూడు గంటల్లో నిందితులను పట్టుకున్నామని, బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇచ్చామని హోంమంత్రి తానేటి వనిత గుర్తుచేశారు. మహిళలకు ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు తెగ ఆరోపణలు చేస్తున్నారని.. తనను ట్రోల్ చేయడం టీడీపీ నేతలు మహిళలకు ఇచ్చే గౌరవమా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్…
అమరావతి: టీడీపీ గ్రామ కమిటీలతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదుపై సమీక్ష జరిపారు. జగన్ పన్నుల పాలనను చాటి చెప్పేలా బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ఏపీ పరిస్థితిపై ఆర్థిక వేత్తల ఆందోళన రాష్ట్ర పరిస్థితికి దర్పణమని తెలిపారు. ఇప్పటివరకు 163 నియోజకవర్గాల్లోని 3 వేలకుపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. మరోవైపు భారీ ఎత్తున మెంబర్ షిప్ చేయడంలో…
తిరుపతి రుయా ఆస్పత్రి ఘటనపై ఎన్టీవీతో మంత్రి రోజా స్పందించారు. రుయాసంఘటన దురదృష్టకరమని అభిప్రాయపడ్డ ఆమె.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. డెడ్ బాడీకి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వాహనం ఇవ్వలేదని తెలిసిందని.. ఇది సూపరింటెండెంట్, సీఎస్‌ఆర్‌ఎంవో బాధ్యత అని.. కానీ ఎలా మిస్ అయిందో తెలియదన్నారు. ఈ ఘటనపై వెంటనే జిల్లా అధికారులను పంపించి నివేదిక ఇవ్వమని చెప్పినట్లు మంత్రి రోజా వివరించారు. ఇప్పటికే ఈ ఘటనలో సీఎస్ఆర్ఎంవోను సస్పెండ్ చేశామని.. ఆస్పత్రి…