భోజనంలో రుచులు కోరుకున్నట్టే.. శృంగారంలోనూ కొత్త రుచులు కోరుకుంటారు. చాలా మంది స్త్రీ, పురుషులు తమ జీవిత భాగస్వాములతో సరిపెట్టుకోలేరు. ఇతర వ్యక్తులతో ఆ ఆనందం కోసం పెంపర్లాడతారు. ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. భారత్ సహా అన్ని దేశాల్లో జరిగేది ఇదే. గత ఏడాది భారత ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దక్షిణాది రాష్ట్రాల స్త్రీ పురుషులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.
ఆంధ్రప్రదేశ్ పురుషులు మహా ధైర్యవంతులో.. లేదంటే ఇతర దక్షిణాది రాష్ట్రాల మగవారు మహా సిగ్గరులో తెలియదు. కానీ భారత్ ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5) ప్రకారం ఏపీలో పురుషులు తమ జీవితకాలంలో సగటున కనీసం నలుగురు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు.
2020-2021 మధ్య నిర్వహించిన ఈ సర్వే ప్రకారం మిగతా దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, కేరళ, తెలంగాణకు చెందిన పురుషులతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మగాళ్లు మహా రసికులని తెలిసింది. మిగతా రాష్ట్రాల వారి కన్నా వీరు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు. ఏపీలో ఒక పురుషుడు సగటున 4.7 మంది స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడు. మహిళల విషయానికి వస్తే వారు తమ జీవితకాలంలో సగటున 1.4 మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు.
ఈ విషయంలో ఏపీ తరువాత తెలంగాణ పురుషులు ఉన్నారు. వారు తమ లైఫ్‌టైమ్‌లో ముగ్గురితో లైంగిక సంబంధం ఉన్నారు. కర్ణాటక మగాళ్లు సగటున 2.7 స్త్రీలతో, అండమాన్ అండ్ నికోబార్ దీవులలో 2.8, కేరళలో 1.2, లక్షదీప్ లో 1.2, పుదుచ్చేరి, తమిళనాడులో 1.8 మహిళల చొప్పున పురుషుడు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు.
HIV/AIDS పట్ల అవాగాహన, యువకులు-పెద్దల లైంగిక ప్రవర్తనలు, వారి సెక్స్ ఆలోచనల గురించి తెలుసుకోవడం కోసం ఈ సమాచారం సేకరించారు. 1-49 సంవత్సరాల మధ్య వయసు పురుషులు, మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. సర్వేలో భాగంగా వారి లైంగిక జీవితానికి సంబంధించి పలు ప్రశ్నలు అడిగారు. గత ఏడాది కాలంలో భర్త లేదా భార్యతో కాకుండా ఇంకా ఎవరితో అయినా లైంగిక సంపర్కం జరిపారా? జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎవరితో అయినా లైంగిక సంబంధం పెట్టుకున్నారా? ఒక వేళ అలాంటి సంబంధం ఉంటే ఇప్పటి వరకు సగటున ఎంతమంది లైంగిక భాగస్వాములను కలిగిఉన్నారు? ఇటువంటి ప్రశ్నలు అనేకం అడిగారు.
సర్వేలో పాల్గొన్న ఏపీ పురుషులలో 3.8 శాతం మంది గడచిన 12 నెలల కాలంలో తమ భార్య లేదా సహజీవనంలో ఉన్న మహిళతో కాకుండా మరో స్త్రీతో సంభోగించామని చెప్పారు. పుదుచ్చేరీ, తమిళనాడు పురుషులు తమ జీవిత కాలంలో సగటున 2, 2.4 మహిళల చొప్పున లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నామని అంగీకరించారు. ఆరోగ్యం- కుటుంబ సంక్షేమంపై అవసరమైన సమాచార సేకరణతో పాటు ఆరోగ్య రంగంలో తలెత్తుతోన్న ఇతర సమస్యలపై డేటాను అందించడటమే లక్ష్యంగా 2019-21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నిర్వహించారు.
మరోవైపు గత ఏడాది 35 దేశాలలో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రపంచంలో ఒక పురుషుడు తన జీవిత కాలంలో సగటున తొమ్మిది మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నాడు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన మగాడికి సగటున 9.8 మంది స్త్రీలతో శృంగార సంబంధం ఉంది. టర్కీలో అత్యధికంగా 14.5 మంది స్త్రీలతో ఆ సంబంధం పెట్టుకున్నారు. చివరగా భారత్ ముగ్గురు లైంగిక భాగస్వాములతో ఈ జాబితాలో అట్టడుగున ఉంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చినపుడు భారతీయ పరుషులు కొంత మేలు అనిపిస్తుంది.