తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోగా.. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదివాడని.. అందుకే ఆయన అన్ని మతాల వారిని సమానంగా చూస్తాడని కొనియాడారు.
Andhra Pradesh: రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్
వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గడప గడపకు కార్యక్రమం ద్వారా ప్రజలు సీఎం జగన్‌ను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్ధమవుతోందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు. పేదవాళ్లు విద్యావంతులు కావడానికి ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ విద్యను అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై అక్కసుతోనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నాడని.. ఆయన వల్ల ఒక్కరికి కూడా ఒరిగిందేమీ లేదన్నారు. అసలు చంద్రబాబు వల్ల ఒక్కరికి లబ్ధి చేకూరిందని చెప్పే పరిస్థితి లేదని ఆరోపించారు. పవిత్రమైన తిరుమల లాంటి ప్రదేశంలో చంద్రబాబు పేరు ఉచ్చరించడానికి కూడా తన మనస్సు అంగీకరించడం లేదని నారాయణస్వామి అన్నారు.