ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ రెడ్డీ… ప్యాక్ యువర్ బ్యాగ్స్, నీ ఖేల్ ఖతం అంటూ ఎద్దేవా చేశారు. 151 ఎమ్మెల్యేలు ఉండి పరదాలు, బ్యారికేడ్లు లేకుండా బయట కాలు పెట్టలేని యువ నాయకుడని పిలవబడే వృద్ధుడు ఒక వైపు, అర్ధరాత్రి అవుతున్నా అశేష జన సందోహం ప్రేమాభిమానాల మధ్య అలసట లేని ముఖంతో మా నాయకుడు ఓ వైపు అంటూ…
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతల పంచాయతీ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు మధ్య కొంతకాలంగా గ్రూప్ తగాదాలు ఉన్నా.. ఇప్పుడు అవి పీక్స్‌కు చేరాయి. ఈ విషయం సీఎం ఆఫీసు వరకు వెళ్లింది. దీంతో వీరిద్దరి వ్యవహారం త్వరగా తేల్చాలని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. వల్లభనేని వంశీమోహన్,…
విద్యాశాఖపై గురువారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా అమ్మ ఒడికి బదులుగా ల్యాప్ టాప్ ఆప్షన్‌ను 8.21 లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. నాడు-నేడులో భాగంగా ఇప్పటి వరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. సుమారు 23,975 స్కూళ్లలో నాడు-నేడు రెండో దశ కింద పనులు జరుగుతున్నాయని.. నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండో దశ కింద చేపట్టనున్న అన్ని…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిటిబ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. భారత దేశంలో అత్యంత అవినీతి సీఎం జగన్ అని.. ఏపీలో కిలోమీటర్ అభివృద్ధి కూడా జరగలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పథకం ప్రకారం జగన్ అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. కల్పవృక్షం లాంటి అమరావతిని నీరుగార్చారని.. ఒక సామాజిక వర్గానికి అమరావతిని అంటగట్టడం దారుణమైన విషయమని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం అమరావతే రాజధాని…
ఏపీలో ఈనెల 26 నుంచి 29 వరకు వైసీపీ మంత్రులు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు గురువారం నాడు మంత్రులు బొత్స, ధర్మాన, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగ నాగార్జున బస్సు యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయ భేరీ పేరుతో బస్సు యాత్రను చేపడుతున్నామని వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు వరుసగా నాలుగు బహిరంగ సభలు నిర్వహించాలని…
రెండేళ్లకు పైగా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు బుధవారం నాడు సచివాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు జీడీఏలో రిపోర్టు చేశారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. తాను సీఎస్ సమీర్ శర్మను కలవలేదని చెప్పారు. తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అసంపూర్ణంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకే తాను సీఎస్ సమీర్ శర్మను కలిసేందుకు ప్రయత్నించానని.. అయితే తనను కలిసేందుకు…
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, అగ్రికల్చర్‌పై రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇదే మొదటి సమావేశమని తెలిపారు. ఈ మీటింగ్‌లో వచ్చిన సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాను ముందుండి నడిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పాత కృష్ణా జిల్లాకు మంచి పేరు ఉందని.. ఇప్పుడు అదే రీతిలో ఎన్టీఆర్ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని…
కర్నూలు జిల్లా పర్యటనలో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కార్యకర్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని మండిపడ్డారు. తాను తప్పు చేయనని.. నిప్పులాంటి మనిషినని.. ఎవరెన్ని కుట్రలు చేసినా తననేమీ చేయలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను కన్నెర్ర చేస్తే సీఎం జగన్ తట్టుకోలేరని హెచ్చరించారు. జగన్ పాలనలో ప్రజలకు వేధింపులు, అప్పులు, బాదుడే బాదుడు తప్పడం లేదని ఎద్దేవా చేశారు. Somu…
ఏపీ సీఎం జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ధాన్యానికి మద్దతు ధర లేదని.. కొనుగోళ్లలో ఘరానా మోసం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అధికారులతో కుదిరిన ఒప్పందాన్ని మాత్రం దర్జాగా అమలు చేస్తూ మిల్లర్లు రైతుల నోట్లో దుమ్ము కొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనేక వేదికల మీద ఈ విషయం చెబుతోన్నా ప్రభుత్వం మొద్దు…
ధాన్యం కొనుగోలులో దోపిడీ అంటూ కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. రైతు భరోసా కేంద్రాలపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తడిసిన ధాన్యమైనా కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. రైతులు కాని వారిని రైతులుగా చూపిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు రాతలతో విషప్రచారం చేస్తున్నాయని.. ఇలాంటి వార్తలపై తాము కోర్టును ఆశ్రయిస్తామని…